- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘దమ్ముంటే ఇప్పటికైనా రా’.. CM రేవంత్‌కు కేటీఆర్ సంచలన సవాల్
దిశ, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఇప్పటికైనా మల్కాజిగిరిలో పోటీకి రావాలి ఛాలెంజ్ చేశారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి పోటీకి వస్తే.. మల్కాజిగిరిలో మా అభ్యర్థిని బతిమిలాడుకొని నేను పోటీలో నిలబెడతానన్నారు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్నా తర్వాత కూడా రేవంత్ రెడ్డి బయపడుతున్నాడని.. ఆయన ఒక పిరికోడు.. మాటలు ఎక్కువ చెప్తాడు కానీ.. సవాలు స్వీకరించే దమ్ములేదని ఎద్దేవా చేశారు. మల్కాజ్గిరిలో పోటీ చేయాలని నేను విసిరిన సవాలుపై రేవంత్ రెడ్డి పారిపోయాడని సెటైర్ వేశారు. నా సవాల్‌పై ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి భయంతో మాట్లాడడం లేదని అన్నారు. మల్కాజిగిరి పార్లమెంట్ నేతలో కేటీఆర్ ఇవాళ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మల్కాజిగిరిలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ బలాన్ని చూసి ముఖ్యమంత్రి మౌనం వహించారని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి సెక్రటేరియట్లో లంక బిందెల సంగతేమో కానీ.. హైదరాబాద్ నగరంలో ఖాళీ బిందెలు కనిపిస్తున్నాయని చమత్కరించారు. లంకెల బిందెల కోసం తట్ట, పారాలు పట్టుకొని, అర్ధరాత్రి చీకట్లో కరుడుగట్టిన దొంగలు తిరుగుతారని సీఎం వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ఇంత అడ్డగోలుగా మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండడం పట్ల ప్రజలు సిగ్గుపడుతున్నారని మండిపడ్డారు. రాహుల్ గాంధీ దేశమంతా తిరిగి నరేంద్ర మోడీని చౌకీదారు చోర్ హై అంటే.. రేవంత్ రెడ్డి మాత్రం మా బడే భాయ్ అంటున్నాడని అన్నారు.
అదాని ఫ్రాడ్ అని రాహుల్ అంటే.. రేవంత్ రెడ్డి హమారా ఫ్రెండ్ హై అంటున్నాడని ఎద్దేవా చేశారు. తెలంగాణ మాడల్ కాదు.. గుజరాత్ మోడల్ చేస్తా అని రేవంత్ రెడ్డి అంటుండు.. గుజరాత్ మోడల్ అంటే గోద్రా హింస చేస్తారా..? బుల్డోజర్లు తీసుకొచ్చి పేద ప్రజల పైకి నడిపిస్తాడా రేవంత్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. నువ్వు రాహుల్ గాంధీ మనిషివా.. నరేంద్ర మోడీ మనిషివా.. బీజేపీ మనిషివా.. కాంగ్రెస్ నేతవా.. రేవంత్ రెడ్డి చెప్పాలే అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క ఓటు కాంగ్రెస్‌కు వేసినా, అది నేరుగా బీజేపీకి లాభం జరుగుతుందన్నారు.
30-40 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీలోకి పోయేందుకు రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్తాడని మరోసారి అన్నారు. ఈ అంశం పైన రేవంత్ రెడ్డి సమాధానం చెప్పమంటే చెప్పట్లేదన్నారు. రేవంత్ రెడ్డి తిరగని పార్టీ దేశంలో లేదని.. ఏబీవీపీ నుంచి బీఆర్ఎస్, బీఆర్ఎస్ నుంచి టీడీపీకి, టీడీపీ నుంచి కాంగ్రెస్‌కి, కాంగ్రెస్ నుంచి మళ్లీ బీజేపీ మాతృ సంస్థకి వెళ్తాడని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.