మీడియా సంస్థలకు కేటీఆర్ బావమరిది నోటీసులు.. రూ. 160 కోట్లకు దావా

by Ramesh N |
మీడియా సంస్థలకు కేటీఆర్ బావమరిది నోటీసులు.. రూ. 160 కోట్లకు దావా
X

దిశ, డైనమిక్ బ్యూరో: తనపై దుష్ప్రచారం చేశారని బీఆర్ఎస్ అగ్రనేత, మాజీ మంత్రి కేటీఆర్ బామ్మర్ది రాజేంద్రప్రసాద్ పాకాల పలు మీడియా సంస్థలకు నోటిసులు పంపించారు. ఫిబ్రవరి నెలలో రాడిసన్ బ్లూ హోటల్‌లో జరిగిన డ్రగ్స్ కేసులో తప్పుడు వార్తలు ప్రసారం చేశారంటూ 16 మీడియా సంస్థలకు లీగల్ నోటీసులు పంపారు. ఒక్కో మీడియా సంస్థ పైన 10 కోట్ల దావా కింద.. మొత్తంగా 160 కోట్లకు దావా వేశారు. రాడిసన్ బ్లూ హోటల్లో జరిగిన డ్రగ్స్ దందాలో సూత్రధారి రాజేంద్రప్రసాద్ పాకాల అని పలు మీడియా సంస్థల్లో వార్తలు వచ్చాయని, తన మీద అనవసర వార్తలు రాశారని మీడియా సంస్థలకు లీగల్ నోటీసులు పంపించారు.

నోటీసులు అందుకున్న వారం రోజుల్లోగా.. తన పరువుకు భంగం కలిగించేలా పోస్ట్ చేసిన వార్తలు, వీడియోలు డిలీట్ చేయాలని నోటీసుల్లో తెలిపారు. వెంటనే తనకు క్షమాపణలు చెప్పాలని.. లేకపోతే తనపై వచ్చిన తప్పుడు కథనాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

Advertisement

Next Story