రాత్రి వేళ ఒంటరిగా హోటల్‌కు వెళ్లిన మంత్రి కేటీఆర్

by Satheesh |   ( Updated:2023-11-18 07:17:53.0  )
రాత్రి వేళ ఒంటరిగా హోటల్‌కు వెళ్లిన మంత్రి కేటీఆర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ శుక్రవారం రాత్రి హైదరాబాద్ ఓల్డ్ సిటీలో సందడి చేశారు. పాతబస్తీ మదీనా చౌరస్తా దగ్గర ఓ రెస్టారెంట్‌లో మంత్రి కేటీఆర్‌ కనిపించడంతో.. అక్కడకు వచ్చినవారంతా ఒక్కసారిగా షాకయ్యారు. ఎలాంటి హడావుడి లేకుండానే.. వితౌట్‌ ప్రోటోకాల్‌ ఆయన రెస్టారెంట్‌కు వెళ్లారు. అక్కడకు వెళ్లేంత వరకు ఆయనను పెద్దగా ఎవరూ గుర్తుపట్టలేదు. కానీ ఆర్డర్‌ ఇచ్చే సమయంలో మంత్రిని చూసిన అక్కడివారు ఆశ్చర్యపోయారు. కేటీఆర్‌ వస్తున్నారంటే కాన్వాయ్‌తో పాటు.. పోలీసుల హడావుడి ఉంటుంది.

కానీ.. ఇలా సాధారణ పౌరుడిలా వచ్చి బిర్యానీ ఆర్డర్‌ ఇవ్వడం చూసి అంతా షాక్‌ అయ్యారు. ఆయన బిర్యానీతో పాటు.. పలురకాల దేశవిదేశీ వంటకాల రుచి చూశారు. మంత్రి వచ్చారని తెలుసుకుని ఆయనకు స్పెషల్‌ డిషెస్‌ను వడ్డించారు రెస్టారెంట్‌ యాజమాన్యం. ఆయన ఇటు డిన్నర్‌ చేస్తూనే.. అక్కడకు వచ్చిన వారిని పలకరించారు. మంచిచెడులు అడిగి తెలుసుకున్నారు. కేటీఆర్ రాకతో హోటల్‌కు పెద్ద ఎత్తున జనం గుమిగూడారు. మంత్రితో సెల్ఫీలకోసం ఎగబడ్డారు జనం.

Advertisement

Next Story