కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఆ అంశాన్ని స్వాగతించిన KTR

by GSrikanth |   ( Updated:2024-04-06 05:45:12.0  )
కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఆ అంశాన్ని స్వాగతించిన KTR
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు శనివారం ఎక్స్(ట్విట్టర్) వేదికగా ఆసక్తికర పోస్టు పెట్టారు. ఫిరాయింపులు ప్రారంభించిందే కాంగ్రెస్ అని పేర్కొన్నారు. ‘ఆయా రామ్‌.. గయా రామ్‌’ సంస్కృతికి కాంగ్రెస్‌ మాతృసంస్థ అంటూ విమర్శలు గుప్పించారు. పార్టీ ఫిరాయింపులపై మేనిఫెస్టోలో హామీ ఇవ్వడాన్ని ప్రస్తావించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీ మారితే సభ్యత్వం రద్దు అనే హామీని ప్రకటించిందని, పదో షెడ్యూల్‌ చట్ట సవరణ హామీ స్వాగతించదగినదని చెప్పారు. కానీ కాంగ్రెస్‌ ఎప్పటిలానే చెప్పేది ఒకటి.. చేసేది మరొకటని విమర్శించారు. ఇచ్చిన హామీకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ విధానాలు ఉంటాయన్నారు. ఇద్దరు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్‌ను కాంగ్రెస్‌ చేర్చుకుందని, దానం నాగేందర్‌కు ఎంపీ టికెట్‌ కూడా కేటాయించిందని గుర్తుచేశారు. హామీలపైన నిబద్ధత ఉంటే ముందు ఆ ఇద్దరు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ అంశంపైన రాహుల్ గాంధీ మాట్లాడాలని కోరారు.

Advertisement

Next Story