KTR: ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ఇస్తాం.. అసెంబ్లీలో కేటీఆర్ సెన్సేషనల్ కామెంట్స్

by Shiva |
KTR: ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ఇస్తాం.. అసెంబ్లీలో కేటీఆర్ సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌ (Manmohan Singh)కు భారతరత్న (Bharat Ratna) ఇవ్వాలనే ప్రభుత్వ ప్రతిపాదనకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) అన్నారు. ఇవాళ అసెంబ్లీ (Assembly)లో మన్మోహన్ సింగ్ సంతాప తీర్మానంపై ఆయన మాట్లాడుతూ.. భారతరత్న (Bharat Ratna) పురస్కారానికి మన్మోహన్ పూర్తిగా అర్హులని తెలిపారు. ఈ విషయంలో ప్రభుత్వ ప్రతిపాదనకు సంపూర్ణ మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. తన సుధీర్ఘ రాజకీయ జీవితంలో నీతి, నిజాయితీగా మన్మోహన్ వ్యవహరించారని కొనియాడారు. ఆయన ఓ నిరాడంబర మనిషి అని కీర్తించారు.

మన్మోహన్ సింగ్ కేబినెట్‌లో కేసీఆర్ (KCR) కూడా ఏడాదిన్నర పాటు మంత్రిగా పని చేశారని గర్తు చేశారు. వాస్తవానికి మన్మోహన్ సింగ్ ప్రతిభను గుర్తించింది తెలంగాణ (Telangana) బిడ్డ పీవీ నరసింహారావు (PV Narsimha Rao) కావడం గర్వకారణమని అన్నారు. ప్రధానిగా మన్మోహన్ సింగ్ నాయకత్వంలోనే తెలంగాణ (Telangana) ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు జరిగిందని తెలిపారు. ప్రజాస్వామిక ఉద్యమాలకు ఆయన అండగా నిలబడ్డారని కొనియాడారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా.. ఆర్థిక సంస్కరణల్లో ఏమాత్రం వెనక్కి తగ్గలేని అన్నారు. ఎన్ని నిందలు వేసినా.. ఆ స్థితప్రజ్ఞుడు వణకలేదు, తొణకలేదని కేటీఆర్ ప్రశంసించారు.

Advertisement

Next Story