- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
KTR: నేడు జాతీయ చేనేత దినోత్సవం.. భావోద్వేగంతో మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్
దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి: బీఆర్ఎస్ హయాంలో చేనేత రంగంలో చిరునవ్వులు పుశాయని, కానీ కాంగ్రెస్, బీజేపీ పాలనలో చేనేత బతుకులు ఛిద్రమవుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. బుధవారం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తన సామాజిక మహద్యమాల్లోని ఖాతాల్లో భావోద్వేగ సందేశాన్ని షేర్ చేశారు. నరాలను పోగులుగా చేసి.. తమ రక్తాన్ని రంగులుగా వేసి.. గుండెలను కండెలుగా మార్చి.. చెమట చుక్కల్ని చీరలుగా మలచి.. పేగులను వస్త్రాలుగా అందించి.. మనిషికి నాగరికతను అద్దిన చేనేత కార్మికులందరికీ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
బీఆర్ఎస్ పాలనలోనే నేతన్నకు గౌరవం
దశాబ్దాల పాటు దగాపడిన చేనేత రంగానికి బీఆర్ఎస్ పదేళ్ల ప్రగతి ప్రస్థానమని, దేశ చరిత్రలోనే ఓ స్వర్ణయుగమని గుర్తు చేశారు. నేత కార్మికుల కష్టాలు తెలిసిన నాయకుడు, మగ్గానికి మంచిరోజులు తెచ్చిన దార్శనికుడు, వినూత్న పథకాలకు శ్రీకారం చుట్టిన పాలకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని కొనియాడారు. సమైక్య రాష్ట్రంలో ఆరేళ్ల బడ్జెట్ రూ.600 కోట్లేనని, బీఆర్ఎస్ పాలనలో ఏడాదికి రూ.1200 కోట్లు అని, కేసిఆర్ హయాంలోనే నేతన్నలకు గుర్తింపు, గౌరవం దక్కిందని, ఎన్నో విప్లవాత్మక పథకాలకు చిరునామాగా రాష్ట్రం అవతరించిందని తెలిపారు. దేశంలోనే తొలిసారి 50 శాతం సబ్సిడీతో ‘చేనేత మిత్ర’ నేతన్నకు చేయూత పేరుతో త్రిఫ్ట్ ప్రత్యేక పొదుపు పథకం, ‘నేతన్నకు బీమా’ పేరుతో రూ.5 లక్షలు ధీమా
36 వేల మంది నేతన్నల కుటుంబాలకు కొండంత అండగా బీఆర్ఎస్ ప్రభుత్వం నిలిచిందని అన్నారు. 10,150 మంది చేనేత కార్మికులకు రూ.లక్ష వరకు, రూ.29 కోట్ల రుణాల మాఫీ, చేనేత కళాకారులకు ఆసరా పెన్షన్‌తో ఆపన్న హస్తం లాంటి పథకాలతో పద్మశాలీల ఆత్మగౌరవం పెంచే చారిత్రక నిర్ణయాలు అనేకం తీసుకువచ్చిందని గుర్తు చేశారు. సంక్షోభంలో ఉన్న చేనేత రంగాన్ని గట్టెక్కించిన యజ్ఞం లాంటి తెలంగాణ ఆడబిడ్డలకు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. సిరిసిల్లలో అప్పరెల్ పార్క్ ఏర్పాటు ఓ సంకల్పమని, వరంగల్‌లో కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ ఓ సంచలనమని అన్నారు.
ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక..
ఎన్డీఏ హయాంలో తొలిసారి చేనేత వస్త్రాలపై జీఎస్టీ పన్ను విధించిందని, ఆలిండియా హ్యాండ్లూమ్ బోర్డు, ఆల్ ఇండియా హ్యాండీక్రాఫ్ట్స్ బోర్డు, ఆల్ ఇండియా పవర్లూమ్ బోర్డులు రద్దు చేసిందని అన్నారు. చేనేత కార్మికుల త్రిప్ట్ పథకం, హౌస్ కం వర్క్ షెడ్ పథకం, మహాత్మా గాంధీ బునకర్ బీమా పథకలు రద్దు చేయడంతో పాటు యార్న్‌పై సబ్సిడీ 40 శాతం నుంచి 15 శాతానికి తగ్గింపు చేసిందని మండిపడ్డారు.
కాంగ్రెస్ పాలనలో సంక్షోభం..
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో చేనేత రంగం మళ్లీ సంక్షోభంలో కూరుకుపోయిందని, ప్రతి నిత్యం చేనేత కార్మికుల కుటుంబాల్లో ఆత్మహత్యలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కళ్లు తెరిచి, సంక్షోభం నుంచి చేనేత రంగాన్ని గట్టెక్కించి, బీఆర్ఎస్ పాలనలో అమలైన పథకాలు కొనసాగించాలని సూచించారు.