Congress vs KTR: పెయిడ్ ఆర్టిస్ట్‌లతో కుట్ర చేస్తోందంటూ ఫైర్

by karthikeya |
Congress vs KTR: పెయిడ్ ఆర్టిస్ట్‌లతో కుట్ర చేస్తోందంటూ ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్‌ పెయిడ్ ఆర్టిస్ట్‌లతో కుట్రలు చేస్తోందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ (KTR) తీవ్ర విమర్శలు చేశారు. జాన్వాడ రేవ్ పార్టీ కేసుపై ఎక్స్‌ వేదికగా స్పందించిన కేటీఆర్.. రెండు రోజులుగా జరిగింది కాంగ్రెస్ రాజకీయ వేధింపుల ప్రహసనం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ కష్ట సమయంలో తమకు తోడుగా నిలిచిన బీఆర్‌ఎస్ శ్రేణులందరికీ ధన్యవాదాలు చెప్పారు. అయితే కాంగ్రెస్ (Congress) వేధింపులు ఇకపై కూడా కొనసాగుతాయని, ఇలాంటి కక్షపూరిత చర్యలు భవిష్యత్తులో మరిన్ని ఎదుర్కోబోతున్నామని ఆయన చెప్పారు. ఎన్నో కేసులు పెట్టబోతున్నారని, అవసరమైతే డీప్ ఫేక్ టెక్నాలజీతో ఫేక్ కంటెంట్‌ని తమ పెయిడ్ ఆర్టిస్ట్‌ (Paid Artists)ల ద్వారా వైరల్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయిని కేటీఆర్ ఆరోపించారు. అధికార కాంగ్రెస్‌తో పాటు బీజేపీ (BJP), టీడీపీ (TDP).. వాళ్ల సోషల్ మీడియా హ్యాండింట్స్ అన్నీ కలిసి మూకుమ్మడిగా బీఆర్ఎస్‌పై దాడులు చేస్తాయని, అయితే వాటన్నింటిని కూడా ఎదుర్కోవడానికి బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధంగా ఉండలని కేటీఆర్ పిలుపునిచ్చారు.

Advertisement

Next Story