KTR Tweet: ‘పోలీసు బలంతో సమస్యలను అణగదొక్కాలని చూస్తున్నారా..?’ కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్

by karthikeya |
KTR Tweet: ‘పోలీసు బలంతో సమస్యలను అణగదొక్కాలని చూస్తున్నారా..?’ కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు (Pending Bills) చెల్లించకపోగా.. అరెస్టులు చేయడం సిగ్గు చేటని బీఆర్ఎస్ వర్కింగ్ పెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచుల కుటుంబాలు రోడ్డున పడుతున్నా పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం.. పోలీసు బలగంతో సమస్యలను అణగదొక్కాలని చూస్తోందని ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా షాకింగ్ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌లో.. ‘‘రాష్ట్ర వ్యాప్తంగా మాజీ సర్పంచులు అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పెండింగ్ బిల్లులు ఇవ్వాలని ఏడాది కాలంగా అడిగినా ఇవ్వకపోవడం సిగ్గుచేటు.రాష్ట్రంలో నిత్యం అరెస్టుల పర్వమే కొనసాగుతోంది. పోలీసులతో సమస్యలను అణగదొక్కాలని ప్రభుత్వం చూస్తోంది. రాష్ట్రంలోని సమస్యలు గాలికి వదిలి ముఖ్యమంత్రి (Chief Minister), మంత్రులు ఊరేగుతున్నారు.

సర్పంచుల కుంటుంబాలు రోడ్డున పడే దాకా ప్రభుత్వం స్పందించదా? శాంతియుత నిరసనకు పిలుపునిచ్చిన సర్పంచులను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? పల్లె ప్రగతి పేరిట మేము చేపట్టిన కార్యక్రమానికి తూట్లు పొడిచి నిధులు విడుదల చేయకుండా ఆపుతున్నారు. అరెస్ట్ (Arrest) చేసిన సర్పంచ్‌లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ’’ అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియా (Social Media)లో వైరల్ అవుతోంది.

ఇదిలా ఉంటే పెండింగ్‌ బిల్లులు విడుదల చేయాలంటూ తెలంగాణ (Telangana)లో ఆందోళణ నిర్వహించాలని మాజీ సర్పంచులు భావించగా.. గ్రామాల నుంచి నగరానికి వస్తున్న మాజీ సర్పంచులను, వారి అనుచరులను ఎక్కడికక్కడ పోలీసులు అరెస్ట్‌ చేసి స్టేషన్లకు తరలించారు. కాగా.. అరెస్టైన మాజీలు సర్పంచులు.. ఏడాదిగా పెండింగ్ బిల్లుల (Pending Bills) కోసం తిరుగుతున్న పట్టించుకునే నాథుడే లేడని, దీనివల్ల తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని, దీంతో చేసేందేం లేక శాంతియుతంగా నిరసన చేస్తుంటే మమ్మల్ని ఇలా అరెస్ట్ చేయడం దారుణమంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Next Story