- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ ప్రజల జీవితాల్లో కాంగ్రెస్ నిప్పులు పోసింది: KTR
దిశ,వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రజల జీవితాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం నిప్పులు పోసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ప్రజల భూములు లాక్కోవడానికి ప్రయత్నిస్తున్న సర్కార్.. తమ భూములు లాక్కోవద్దని ఎదురుతిరిగిన రైతులను అక్రమంగా అరెస్ట్‌లు చేస్తోందని ఆరోపించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన పోస్ట్‌ను షేర్ చేశారు. అందులో ‘‘పనిమంతుడు పందిరేస్తే-కుక్క తోక తగిలి కూలిపోయిందట. సంక్షేమ గురుకుల పాఠాశాలల ఆహార బిల్లులు, అద్దెలు చెల్లించకపోవడంతో వాటికి తాళాలు వేస్తే గానీ 9 నెలలకు 3 నెలల బిల్లులు చెల్లించారు. కానీ వేదికల మీద మాత్రం నాణ్యత లేకుంటే జైలుకే అని కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నారు. 11 నెలల పాలనలో సంక్షేమ గురుకుల పాఠశాలల నిర్వహణ గాలికి వదిలేశారు. 36 మంది విద్యార్థులు వివిధ కారణాలతో చనిపోయారు.
వందలాది గురుకుల పాఠశాలలు, వసతిగృహాల విద్యార్థులు రోడ్డెక్కుతున్నారు. పత్తి, వరి ధాన్యం కొనుగోళ్లు చేపట్టక ఆందోళన చేసినా ప్రభుత్వంలో చలనం లేకపోవడంతో రైతన్నలు అడ్డికి పావుశేరు కింద తమ ఆరుగాలం కష్టాన్ని అమ్ముకుంటున్నారు. హైడ్రా, మూసీ సుందరీకరణ పేరుతో హైదరాబాద్ పేదల బతుకుల్లో నిప్పులుపోసి కంటికి కునుకు లేకుండా చేశారు. ఫార్మాసిటీకి సేకరించిన భూమిని పక్కన పెట్టి ఫార్మా క్లస్టర్ల పేరుతో గిరిజనుల జీవితాల్లో భయాన్ని నింపారు. మా భూములు మాకేనని ఎదిరించిన వారిని అక్రమ కేసులతో జైళ్లకు పంపుతున్నారు. 11 నెలల పాలనలో సంక్షేమం మాయమయింది. అభివృద్ధి దూరమయింది. కాంగ్రెస్ తెచ్చిన మార్పు చూసి తెలంగాణ నివ్వెరపోతుంది. కాలంబు రాగానే కాటేసి తీరాలని ఎదురుచూస్తుంది’’ అని ట్విటర్ వేదికగా కాంగ్రెస్‌పై కేటీఆర్ మండిపడ్డారు.