- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
KTR vs Rahul Gandhi: ‘‘మోసగాళ్లకు కౌంట్‌డౌన్ స్టార్ట్..’’ రాహుల్ గాంధీపై కేటీఆర్ షాకింగ్ పోస్ట్
దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల సమయంలో సాధ్యం కాని హామీలిచ్చి ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ (Congress) ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయిందని బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మండిపడ్డారు. వందరోజుల్లో ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్.. 365 రోజులకు 30 రోజులే మిగిలి ఉన్నా ఇంకా హామీలు అమలు చేయలేదని, దీనికి ఢిల్లీ బాబు రాహుల్ గాంధీ (Rahul Gandhi) సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎక్స్ (X) వేదికగా ఓ సుదీర్ఘ పోస్ట్‌ను షేర్ చేశారు.
“వంద రోజుల్లో నెరవేరుతుంది ప్రతి గారంటీ” అని చెప్పిన మోసగాళ్లకు కౌంట్ డౌన్ స్టార్ట్. మూడు వందల ముప్పై రోజులు ముగిసింది, ఏడాది నిండడానికి 35 రోజులే మిగిలింది!
ఏడాదికి 35 రోజులు మాత్రమే మిగిలింది - 2 లక్షల జాబ్‌లు ఎక్కడ అంటున్నారు నిరుద్యోగులు.
ఏడాదికి 35 రోజులే మిగిలింది – ఎకరాకు రూ.15000 రైతు భరోసా ఏమైంది అంటున్నారు రైతన్నలు.
ఏడాదికి 35 రోజులే మిగిలింది – పెంచిన రూ.4,000 పెన్షన్ ఎక్కడంటున్నారు అవ్వ తాతలు
ఏడాదికి 35 రోజులే మిగిలింది-నెల నెల ఇస్తామన్న రూ.2500 ఎక్కడబోయాయి అంటున్నారు అడబిడ్డలు
ఏడాదికి 35 రోజులే మిగిలింది-పెంచి ఇస్తామన్న రూ.6,000 పెన్షన్ ఎక్కడని నిలదీస్తున్నారు దివ్యంగా అన్నలు,అక్కలు
ఏడాదికి 35 రోజులే మిగిలింది-ఉద్యోగులు మా పీఆర్సీ ఎక్కడ, మా డీఏలు ఎక్కడని సమ్మెలకు సై అంటున్నారు
ఏడాదికి 35 రోజులే మిగిలింది – కౌలు రైతులు రూ.15000 ఎక్కడ, రైతు కూలీలు రూ.12000 ఎక్కడ అంటున్నారు
ఏడాదికి 35 రోజులే మిగిలింది – తులం బంగారం ఎక్కడా అంటున్నారు మా బంగారు తల్లులు
చెప్పిన హామీలన్నీ బూడిదలో పన్నీరయ్యే – చెప్పని మూసీలో లక్షల కోట్ల మూటలాయే
ఏడాది కాలమంతా అటెన్షన్ డైవర్షన్ తో పబ్బం గడిపిన మూసి సర్కార్
ఏముంది ఈ ప్రజా పాలనలో గర్వకారణం ధర్నాలు,రాస్తారోకోలు తప్ప?
జవాబు చెప్తావా ఢిల్లీ బాబు రాహుల్ గాంధీ?’ అంటూ కేటీఆర్ చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.