- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్ ప్రభుత్వంపై KTR సీరియస్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీరియస్ కామెంట్స్ చేశారు. గురువారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో మీడియా ప్రతినిధులతో కేటీఆర్ చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను పరిశీలించి తీరుతామని స్పష్టం చేశారు. రోజుకు 5 వేల క్యూసెక్కుల నీరు వృథాగా పోతోందని అన్నారు. బ్యారేజీలను పరిశీలించాక అన్నారంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామని వెల్లడించారు. మొత్తం మేడిగడ్డకు 200 మంది నాయకుల బృందంతో వెళ్లబోతున్నట్లు తెలిపారు. చిన్న విషయాన్ని కాంగ్రెస్ రాద్ధాంతం చేస్తోందని.. మేడిగడ్డలో పగుళ్లను తాము కూడా పరిశీలిస్తామని చెప్పారు. ఏదైనా చిన్న పొరపాటు జరిగితే ప్రభుత్వం దానిని సరిచేసి ప్రజలకు ఉపయోగపడేలా చేయాలని కానీ.. ఇలా రాజకీయంగా వాడుకోవాలని చూడకూడదని హితవు పలికారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 80 రోజులు గడిచిందని.. ఈ 80 రోజుల్లో గత బీఆర్ఎస్ పాలనపై ఆరోపణలు, శ్వేతపత్రాలు అంటూ కాలయాపన చేశారు కానీ, ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు. NDSA సాంకేతిక బృందం ఎక్కడైనా శాంపిల్ సేకరించిందా? అని ప్రశ్నించారు. కేవలం ప్రజల దృష్టిని మరల్చేందుకే కాంగ్రెస్ సిల్లీ పాలిటిక్స్ చేస్తోందని మండిపడ్డారు. దమ్ముంటే తప్పు జరిగితే నిరూపించండి.. తప్పని తేలితే చర్యలు తీసుకోండి అని సవాల్ చేశారు. ఇదంతా పక్కనబెట్టి నీళ్లు ఇచ్చే అవకాశం ఉన్నా.. ఇవ్వకుండా బీఆర్ఎస్‌ను బదనాం చేస్తూ రైతులను ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన చెందారు.