KTR: మహిళా కమిషన్ ముందు హాజరవుతా

by Gantepaka Srikanth |   ( Updated:2024-08-17 11:02:23.0  )
KTR: మహిళా కమిషన్ ముందు హాజరవుతా
X

దిశ, వెబ్‌డెస్క్: ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపాయి. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీ మహిళా నాయకురాళ్లు ఆయన వ్యాఖ్యలను ఖండించారు. బహిరంగంగా తెలంగాణ మహిళా సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ అనుచిత వ్యాఖ్యలపై రాష్ట్ర మహిళా కమిషన్ స్పందించి.. సుమోటోగా స్వీకరించింది. ఈనెల 24న కమిషన్ ముందుకు హాజరై వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. తాజాగా ఈ నోటీసులపై కేటీఆర్ స్పందించారు. శనివారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. 24వ తేదీన మహిళా కమిషన్ ముందు హాజరవుతాను అని ప్రకటించారు. ‘గత 8 నెలల్లో మహిళలపై జరిగిన ఘటనల వివరాలను తీసుకెళ్తాను. తాను బహిరంగ క్షమాపణ చెప్పిన తర్వాత కూడా నోటీసులు ఇచ్చారు. తమ పార్టీ మహిళా ఎమ్మెల్యేలపై సీఎం, కాంగ్రెస్ నేతలు చేసిన కామెంట్లను కమిషన్ దృష్టికి తీసుకెళ్తా. తాను చట్టాలను గౌరవించే వ్యక్తిని’ అని కేటీఆర్ అన్నారు.

Advertisement

Next Story

Most Viewed