బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థిపై KTR ప్రశంసలు

by Disha Web Desk 9 |
బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థిపై KTR ప్రశంసలు
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ పార్టీ నాగర్‌కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. సంచలనాలకు, సంస్కరణలకు, సరికొత్త ఆలోచనలకు పెట్టింది పేరు డా. ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అని పొగడ్తలతో ముంచెత్తారు. నల్లమల ప్రాంతంలో పుట్టిన ప్రవీణ్ కుమార్ తన 6 ఏళ్ల పదవి కాలాన్ని వదులుకొని బడుగు బలహీనవర్గాల అభ్యున్నతి కోసం బహుజనవాదాన్ని భుజాన ఎత్తుకొని ప్రజాసేవలోకి అడుగుపెట్టారని కొనియాడారు. తన పదవీ కాలంలో పోలీస్ వ్యవస్థలో ఎన్నో వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టారని, ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు ఆద్యులని కేటీఆర్ చెప్పుకొచ్చారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు ఐక్యరాజ్యసమితి కోసం ఒకప్పటి యుగోస్లావియాలో కూడా పని చేశారన్నారు. ప్రవీణ్ కుమార్ గళం.. నాగర్‌కర్నూల్‌కు బలమని అన్నారు. కారు గుర్తుకే ఓటేద్దాం ప్రవీణ్ కుమార్‌ను గెలిపిద్దామని పిలుపునిచ్చారు.

Next Story

Most Viewed