- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
KTR: కాంగ్రెస్ పాలనలో పల్లె ప్రగతి లేదు.. పట్టణ ప్రగతి లేదు: కేటీఆర్ సెటైరికల్ ట్వీట్
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ (Congress), ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ (BRS) మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఎన్నికల్లో ఇచ్చి హామీలను అమలు చేస్తూ.. ప్రగతి పథంలో తెలంగాణ (Telangana) దూసుకెళ్తోందని అధికార పార్టీ నేతలు చెబుతుంటే.. గులాబీ లీడర్లు మాత్రం ‘ఇదేనా మార్పు’ అంటూ విమర్శలకు దిగుతున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) ‘X’ (ట్విట్టర్) వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. పనికిమాలిన పాలనలో పల్లె ప్రగతి లేదు.. పట్టణ ప్రగతి లేదని కామెంట్ చేశారు. ముందుచూపు లేని ముఖ్యమంత్రితో రాష్ట్రానికి అతీగతీ లేదన్నారు. ‘పల్లె ప్రగతి’తో మొన్నటి దాకా మురిసిన పల్లెలు నేడు మురికి కూపాలను తలపిస్తున్నాయని ఆరోపించారు. ‘పట్టణ ప్రగతి’తో పరుగులు తీసిన పట్టణాలు.. నేడు సమస్యలకు నిలయాలుగా మారుతున్నాయని ఆక్షేపించారు. ఒకప్పుడు పల్లె కన్నీరు పెడుతుంది అని పాడుకున్నాం.. ఇప్పుడు పట్టణాలు విలవిలలాడుతున్నాయని బాధపడే దుస్థితి వచ్చిందని అన్నారు. ఈ మార్పు మాకొద్దు అనే నినాదం మొదలైంది.. కాంగ్రెస్ (Congress)ను కూకటివేళ్లతో పెకిలించే రోజు దగ్గర పడిందని ట్వీట్ చేశారు.
అదేవిధంగా రాష్ట్రంలో రైతులు పండించిన పంటలపై ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం పట్ల ఆయన ‘X’ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. కాంగ్రెస్ (Congress) ఆఫీసులో ‘కనుగోలు’ కేంద్రం తప్ప.. రాష్ట్రంలో ఒక్క కొనుగోలు కేంద్రం పనిచేయడం లేదని అన్నారు. ఏ రైతుకు సీఎం (CM) మద్దతు లేదని.. అందుకే వరి, పత్తి ఇలా దేనికీ మద్దతు ధర లేదని ఫైర్ అయ్యారు. ఇందిరమ్మ రాజ్యంలో.. దోపిడీ రాజ్యమేలుతోందని, రైతుల రెక్కల కష్టం దర్జాగా దళారుల పాలవుతోందని ధ్వజమెత్తారు. సన్నాలకే బోనస్ అన్న సన్నాసుల మాట.. మార్కెట్ యార్డుల సాక్షిగా నీటిమూటే అయ్యిందని కామెంట్ చేశారు. ఇక.. ఈ ఇందిరమ్మ రాజ్యం ఉండెందుకు.. ఆరుగాలం కష్టించే అన్నదాతను అరిగోస పెట్టేటందుకా అని కేటీఆర్ (KTR) ట్వీట్ చేశారు.