- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
KTR: సురేఖ వ్యాఖ్యలతో నా పరువు, ప్రతిష్టలు దెబ్బతిన్నాయ్: కోర్టులో కేటీఆర్ సంచలన స్టేట్‌మెంట్
దిశ, వెబ్‌డెస్క్: నటుడు నాగచైతన్య (Naga Chaitanya), హీరోయిన్ సమంత (Samantha) విడాకుల విషయంలో తెలంగాణ మంత్రి కొండా సురేఖ (Minister Konda Surekha) తనపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో మాజీ మంత్రి కేటీఆర్ (Former Minister KTR) ఆమెపై నాంపల్లి స్పెషల్ కోర్టులో పరువు నష్టం దావా కేసు వేశారు. ఈ మేరకు ఆయన ఇవాళ వాగ్మూలం ఇచ్చేందుకు కోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మెజిస్ట్రేట్ (Magistrate) ముందు మాట్లాడుతూ.. బాధ్యత గల పదవిలో ఉన్న మహిళా మంత్రి తమ పరువుకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారని కోర్టుకు విన్నవించారు.
తాను ఓ డ్రగ్ అడిక్ట్ అని, రేవ్ పార్టీలు నిర్వహిస్తానంటూ మీడియా ముఖంగా ఆసంబద్ధమైన ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. కేసులో సాక్షులు తనకు గత 18 సంవత్సరాలుగా తెలుసని అన్నారు. మంత్రి కొండా సురేఖ (Minister Konda Surekha) వ్యాఖ్యలను టీవీలో చూసి వాళ్లు తనకు స్వయంగా ఫోన్లు చేసి చెప్పారని గుర్తు చేశారు. సురేఖ వ్యాఖ్యలతో తన పరువు, పతిష్టలు దెబ్బతిన్నాయని మెజిస్ట్రేట్‌కు వివరించారు. తనతో పాటు బీఆర్ఎస్ (BRS) పార్టీకి నష్టం చేయాలని కొండ సరేఖ కావాలనే ఇలాంటి వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడిన వీడియో రికార్డింగ్స్ (Video Recordings)ను కూడా కోర్టుకు అందజేశారు.
ఈ కేసులో కేటీఆర్‌తో పాటు బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ (Dasoju Sravan) స్టేట్‌మెంట్‌ను కూడా కోర్టు రికార్ట్ చేశారు. అదేవిధంగా మిగతా సాక్షుల స్టేట్‌మెంట్ రికార్టును మెజిస్ట్రేట్ ఈ నెల 30కి వాయిదా వేశారు.