- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
‘దాడులు చేయడం మంచిదేనా కేటీఆర్?’.. మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
దిశ,వెబ్‌డెస్క్: పదేండ్లు అధికారంలో ఉండి రాష్ట్ర అభివృద్ధి(State Development) కోసం కేంద్రమంత్రులను కలవడానికి చేతగాని కేటీఆర్(KTR).. కేసుల మాఫీ కోసం కొత్త నాటకానికి తెరతీసిండు అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Minister Komati Reddy Venkata Reddy) విమర్శించారు. ఈ క్రమంలో వికారాబాద్ కలెక్టర్ పై దాడి బాధాకరమని వెంకట్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనపై దాడి చేసింది బీఆర్‌ఎస్ కార్యకర్త సురేష్ అని అధికార యంత్రాంగం గుర్తించిందని మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కలెక్టర్, అధికారులపై దాడులు చేయడం మంచిదేనా కేటీఆర్ అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు. దాడులకు దిగిన వారికి మద్ధతిస్తామని బీఆర్‌ఎస్ నేతలు చెప్పడం దారుణమన్నారు. లగచర్ల ఘటనకు సంబంధించి కేటీఆర్‌తో మాజీ ఎమ్మెల్యే ఫోన్‌లో మాట్లాడినట్లు సమాచారం ఉందన్నారు. దాడి వెనుక ఎవరున్నా వదలబోమని మంత్రి కోమటిరెడ్డి హెచ్చరించారు. ఎఫ్-1 రేసులో ఆర్‌బీఐ అనుమతి లేకుండా డబ్బులు చెల్లించారని, ఈ కేసులో కేటీఆర్ తప్పించుకోలేరని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు.