రాఖీ సినిమాలో ఎన్టీఆర్‌‌ను తలపిస్తోన్న కేటీఆర్ (PHOTO)

by Gantepaka Srikanth |   ( Updated:2024-08-19 15:26:25.0  )
రాఖీ సినిమాలో ఎన్టీఆర్‌‌ను తలపిస్తోన్న కేటీఆర్ (PHOTO)
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు ప్రజలు రక్షా బంధన్‌(రాఖీ పండుగ)ను ఎలా జరుపుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జీవితంలో ఒకసారి సోదరుడికి రాఖీ కట్టకపోతే కన్నీరుమున్నీరుగా విలపిస్తుంటారు. రాఖీకి అంత ప్రత్యేకత ఉంది. తాజాగా సోమవారం రాఖీ పండుగ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు ఆ పార్టీ మహిళా నాయకురాళ్లు రాఖీలు కట్టారు. రాష్ట్ర నలుమూలల నుంచి భారీగా తరలివచ్చి చేతి నిండా రాఖీలు కట్టారు. ప్రస్తుతం చేతుల నిండా రాఖీలతో ఉన్న కేటీఆర్.. రాఖీ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్‌ను తలపిస్తున్నారని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు కేటీఆర్ సోదరి.. కవిత తిహార్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం కవిత తీహార్ జైలులో ఉన్నారు. అంతేకాదు.. కేటీఆర్ తన చెల్లిని గుర్తు చేసుకుంటూ ఇవాళ ఎమోషనల్‌గా ట్వీట్ కూడా చేశారు.

Read More..

రాఖీ రోజు మహిళా మంత్రిని నిందించడం కేటీ‌ఆర్‌కే చెల్లింది.. సీతక్క కౌంటర్

Advertisement

Next Story