- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
KTR: రాజకీయాలు పక్కన పెడితే.. ‘తెలంగాణ ఫస్ట్’: సీఎం రేవంత్ విదేశీ పర్యటనపై కేటీఆర్ సంచలన ట్వీట్
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో విదేశీ పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్‌రెడ్డి బృదం అమెరికా, దక్షిణ కోరియా పర్యటనకు వెళ్లింది. ఈ క్రమంలోనే ట్విట్టర్ వేదికగా మాజీ మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న తాము ఇతర దేశాల్లో ఉన్న ప్రముఖ కంపెనీ ప్రతినిధులతో పెంచుకున్న సంబంధాలు నేడు రాష్ట్రానికి మేలు చేకూరుస్తున్నాయని తెలిపారు. విరామం లేకుండా పట్టుదలతో రాష్ట్రానికి భారీ ఎత్తున వీదేశీ పెట్టుబడులు తీసుకొచ్చామని పేర్కొన్నారు. వాటిని చూసి ఇవాళ మరిన్ని పెట్టుబడులు రాష్ట్రానికి రానుండటం సంతోషకరమని అన్నారు.
కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఆర్థికాభివృద్ధికి అనుకూలమైన పర్యావరణ వ్యవస్థను రూపొందించేందుకు ప్రాధాన్యం ఇచ్చామని తెలిపారు. టీఎస్ ఐపాస్ (TS IPASS)లో ప్రభుత్వ వినూత్నమైన విధానాలకు ఆకర్షితులై చాలా సంస్థలు రాష్ట్రంలో గణనీయంగా పెట్టుబడి పెట్టాయని తెలిపారు. గత దశాబ్ధ కాలంలో రూ.4 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు వివిధ రంగాల్లో 24 లక్షలకు పైగా ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలను సృష్టించామని అన్నారు. రాజకీయాలు పక్కన పెడితే.. తనకు, బీఆర్ఎస్ పార్టీకి ఎల్లప్పుడూ ‘తెలంగాణ ఫస్ట్’ కామెంట్ చేశారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా ప్రత్యక్ష పెట్టుబడులను తీసుకురావడంలో విజయం సాధించాలని, తాము స్థాపించిన బలమైన పునాదిపై తెలంగాణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తారని హృదయపూర్వకంగా ఆశిస్తున్నా.. జై తెలంగాణ అంటూ ట్వీట్ చేశారు.