KTR: ప్రజలపై విద్యుత్ చార్జీల భారం మోపడం సరికాదు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

by Shiva |   ( Updated:2024-10-21 11:17:10.0  )
KTR: ప్రజలపై విద్యుత్ చార్జీల భారం మోపడం సరికాదు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: విద్యుత్ చార్జీల పెంపు నిర్ణయం రాష్ట్ర అభివృద్ధికి గొడ్డలి పెట్టు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఇవాళ ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. కరెంట్ చార్జీల పెంపు ప్రతిపాదనను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా చార్జీల పెంపుతో ఎంఎస్ఎమ్‌ఈ రంగం కుదేలయ్యే పరిస్థితి తలెత్తే అవకాశం ఉందన్నారు. అదేవిధంగా ప్రజలకు విద్యుత్ భారం మోపడం సరికాదని పేర్కొన్నారు.

చార్జీల పెంపు ప్రతిపాదనను విరమించుకోవాలని ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరి కమిషన్‌ను కోరామని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రం నుంచి పరిశ్రమలు వెళ్లిపోతున్న పరిస్థితి నెలకొందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్‌ను ఒక వ్యాపార వస్తువుగా మాత్రమే చూస్తుందని ఆరోపించారు. 300 యూనిట్లు దాటితే ప్రజలు భయపడే పరిస్థితులు వచ్చాయని ఫైర్ అయ్యారు. తెలంగాణలో ఫాక్స్‌కాన్‌ పరిశ్రమ విస్తరణపై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదని అన్నారు. రైతుల మోటర్లకు మీటర్లు పెట్టాలనే ఆలోచనను వ్యతిరేకిస్తున్నారో.. లేదో ప్రభుత్వం ఇప్పటి వరకు స్పష్టం చేయలేదని అన్నారు. విద్యుత్‌ కోతలపై రాష్ట్ర వ్యాప్తంగా అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయని ఆక్షేపించారు. టారిఫ్‌ పెంచుకోవాలని ప్రతిపాదనలు వచ్చినా ఆనాడు సీఎంగా ఉన్న కేసీఆర్‌ అందుకు ఒప్పుకోలేదని గుర్తు చేశారు. అదేవిధంగా పరిశ్రమలు అన్నింటినీ ఒకే కేటగిరి కింద పెట్టడం సరికాదని అన్నారు.

ప్రభుత్వం మూర్ఖపు వైఖరితో ఆందోళనలో గ్రూప్-1 అభ్యర్థులు ఉన్నారని ఆరోపించారు. ఇప్పటి వరకు అభ్యర్థులు అంతా తెలుగు అకాడమీ పుస్తకాలు చదువుకుని ప్రిపేర్ అయ్యారని అన్నారు. బలహీనవర్గాలను ఈ ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని పేర్కొన్నారు. జీవో నెం.29పై బీఆర్ఎస్ తరఫున న్యాయ పోరాటం చేస్తామని అన్నారు. జీవో నెం.55 ప్రకారం గ్రూప్-1 అభ్యర్థులకు న్యాయం జరుగుతుందని కేటీఆర్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed