KTR: ఇది అధికారిక నిర్ణయమా లేక అనధికార నిర్లక్ష్యమా..? మాజీమంత్రి కేటీఆర్ సెన్సేషనల్ ట్వీట్

by Shiva |   ( Updated:2024-08-27 15:48:31.0  )
KTR: ఇది అధికారిక నిర్ణయమా లేక అనధికార నిర్లక్ష్యమా..? మాజీమంత్రి కేటీఆర్ సెన్సేషనల్ ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: కాకతీయ కళాతోరణం, చార్మినార్ లేని మరో రాజముద్ర ప్రస్తుతం వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. తాజాగా, సోమవారం వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో అధికారులు ఎల్ఆర్ఎస్‌పై ఓ హెల్ప్‌ డెస్క్ ఏర్పాటు చేశారు. అయితే, ప్రజలందరికీ విషయం తెలిసేలా ఓ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. కానీ, అందులో కాకతీయ కళా తోరణం, చార్మినార్‌తో కూడిన ప్రభుత్వ అధికారిక చిహ్నం కాకుండా ఇటీవల కొత్తగా ప్రతిపాదించిన రాజముద్రను ప్రింట్ చేయించారు.

ఇక్కడే అసలు గొడవ మొదలైంది. అదే ఫ్లెక్సీపై మాజీ మంత్రి కేటీఆర్ ట్వీటర్ వేదికగా ఫైర్ అయ్యారు. ‘ఇది అధికారిక నిర్ణయమా లేక అనధికార నిర్లక్ష్యమా..? అసలు ఏం జరుగుతోందో కనీసం మీకైనా తెలుసా @Telangana CS గారు? తెలంగాణ అస్తిత్వ చిహ్నాలైన కాకతీయ తోరణం, చార్మినార్‌లతో ఈ వెకిలి పనులు ఏంటి‌‌‌? కాక‌తీయ కళా‌తో‌రణం, చార్మినార్‌ లేని రాజ‌ము‌ద్రతో గ్రేటర్‌ వరం‌గల్‌ కార్పొ‌రే‌షన్‌ ప్రధాన కార్యా‌లయం ఎదుట అధి‌కా‌రులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఇది. ఈ కొత్త చిహ్నం ఎవరు, ఎప్పుడు ఆమోదించారు? ఒకవేళ ఆమోదించకపోతే అధికారులు ఎందుకు దీన్ని వాడారు? దీనికి కారకులెవరో కనుక్కుని వారిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నా’ అని ట్వీట్ చేశారు.

Advertisement

Next Story
null