- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మీ అజబ్ ప్రేమ్ కి గజబ్ కహానీ గమనిస్తూనే ఉన్నారు.. బండికి కేటీఆర్ కౌంటర్
దిశ, డైనమిక్ బ్యూరో: ‘అమృత్’ పథకంపై కాంగ్రెస్, బీఆర్‌ఎస్ డ్రామాలాడుతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఆరు గ్యారంటీల అమలులో వైఫల్యం, హైడ్రా కూల్చివేతల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే రెండు పార్టీలు కొత్త నాటకానికి తెరదీశాయని తాజాగా తీవ్ర ఆరోపణలు చేశారు. అమృత్ పథకంలో జరిగిన అవినీతిపై విచారణ కోరుతూ ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ (సీవీసీ)కు లేఖ రాయాలని ఆయన సూచించారు.
ఈ నేపథ్యంలోనే బండి సంజయ్‌కు మాజీ మంత్రి కేటీఆర్ మంగళవారం ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. ‘గౌరవనీయులైన బండి సంజయ్ గారు.. దొంగలు పడ్డ ఆరు నెలలకి కుక్కలు మొరిగినట్టు ఉంది ఈ వ్యవహారం. మీరు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అన్న విషయం మర్చిపోయినట్లు ఉన్నారు. ‘అమృత్’ మీ కేంద్ర పథకం. అందులో అవినీతి జరిగిందని ముందుగా చెప్పింది స్వయాన మీ పార్టీ ఎంఎల్ఏ ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు. అయినా పాలు తాగుతున్న దొంగ పిల్లిలా కన్వీనియంట్‌గా కళ్ళు మూసుకున్నారు. ఈ వ్యవహారం మొత్తం ఆధారాలతో మేము బయట పెట్టాక ఈ చిల్లర మాటలు దేనికి? సీవీసీ స్వతంత్ర సంస్థ.. దానికి మీ సిఫార్సు దేనికి? అయినా మీ అజబ్ ప్రేమ్ కి గజబ్ కహానీ అందరూ గమనిస్తూనే ఉన్నారు.’ అంటూ తీవ్ర విమర్శలు చేశారు.