KTR: ఆ విషయంలో ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలి.. కేటీఆర్ సంచలన ట్వీట్

by Ramesh Goud |
KTR: ఆ విషయంలో ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలి.. కేటీఆర్ సంచలన ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: చెత్త తరలింపు కేవలం కాగితాల్లో మాత్రమే కనిపిస్తున్నదని, ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి, పౌరుల ఆరోగ్యాలు కాపాడాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.రోడ్లపక్కన కుప్పలుగా పేరుకుపోయిన చెత్తకు సంబందించిన ఫోటోలను ట్విట్టర్ వేదికగా షేర్ చేసిన ఆయన రాష్ట్రప్రభుత్వం పై పలు విమర్శలు చేశారు. ఈ సందర్భంగా.. హైదరాబాద్ నగరంలో ఎక్కడా చూసినా చెత్త కుప్పలే దర్శనమిస్తున్నాయని, సుమారు 1000 స్వచ్ఛ ఆటోలు పనిచేయడం లేదని తెలిపారు.

అలాగే బస్తీలు, కాలనీల్లో వ్యర్థాలు పేరుకుపోవడంతో దోమలు విజృంభిస్తున్నాయని, డెంగీ, మలేరియా, అతిసారం వంటి సీజనల్ వ్యాధులతో ప్రజలు అవస్థలుపడుతున్నారని ఆవేధన వ్యక్తం చేశారు. ఈ చెత్త తరలింపు కేవలం కాగితాల్లో మాత్రమే కనిపిస్తున్నది అంటూ.. మేయర్‌, అధికారుల ఆకస్మిక పర్యటనలు లేకపోవడంతో పారిశుధ్య నిర్వహణ గాడితప్పుతున్నదని ఆరోపించారు. పర్యవేక్షించాల్సిన పార్ట్-టైం మున్సిపల్ మంత్రేమో ఎమ్మెల్యేల కొనుగోళ్లు, ఢిల్లీ చక్కర్లలో బిజీగా ఉన్నారని విమర్శించారు. ఇకనైనా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలని చెబుతూ.. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచి పౌరుల ఆరోగ్యాలు కాపాడాలని కేటీఆర్ సూచించారు.

Advertisement

Next Story

Most Viewed