- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Raksha Bandhan : పండగ పూట కేటీఆర్ భావోద్వేగం.. జైల్లో తన సోదరి కవితపై ఎమోషనల్ ట్వీట్
దిశ, డైనమిక్ బ్యూరో: రాఖీ పౌర్ణమి సందర్భంగా దేశవ్యాప్తంగా ఘనంగా పండుగ వేడుకలు జరుగుతున్నాయి. సాధారణ ప్రజలతో పాటు ప్రముఖులు కూడా రాఖీ వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తన సోదరి అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను గుర్తు చేసుకుని మాజీ మంత్రి కేటీఆర్ భావోద్వేగానికి గురయ్యారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా కవిత ఫోటోలతో ఎమోషనల్ ట్వీట్ చేశారు. ‘ఈ రోజు నువ్వు రాఖీ కట్ట లేకపోవచ్చు. కానీ నీకు ఏ కష్టమొచ్చినా నేను అండగా ఉంటా’ అని ట్వీట్ చేశారు. గతంలో సోదరి కవిత తనకు రాఖీ కట్టిన ఫోటోలు షేర్ చేశారు.
కాగా, ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. నెటిజన్లు సైతం ఆవేదన వ్యక్తంచేశారు. మేమంతా మీ వెంటే ఉన్నామని కేటీఆర్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. కాగా, లిక్కర్ స్కాం వ్యవహారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీహార్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఆమె బెయిల్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న విషయం విదితమే.