KTR:మంత్రి సురేఖ పై కేటీఆర్ పరువు నష్టం కేసు.. విచారణ వాయిదా

by Jakkula Mamatha |
KTR:మంత్రి సురేఖ పై కేటీఆర్ పరువు నష్టం కేసు.. విచారణ వాయిదా
X

దిశ,వెబ్‌డెస్క్: మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) పై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) పరువు నష్టం దావా కేసు విచారణను నాంపల్లి ప్రత్యేక కోర్టు ఈ నెల(నవంబర్) 20 తేదీకి వాయిదా వేసింది. ఈ క్రమంలో కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ పై ఇవాళ(బుధవారం) నాంపల్లి ప్రత్యేక కోర్టులో విచారణ జరిగింది. ఈ క్రమంలో నేడు సత్యవతి రాథోడ్(Satyavathi Rathore), తుల ఉమ వాంగ్మూలాన్ని నాంపల్లి కోర్టు నమోదు చేసింది. తమకు తెలిసిన విషయాలన్నీ కోర్టు దృష్టికి తీసుకెళ్లినట్లు వారు చెప్పారు. ఈ కేసులో గత విచారణలో కేటీఆర్(KTR), దాసోజు శ్రవణ్(Dasoju Shravan) స్టేట్‌మెంట్‌ను కోర్టు నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా.. తనపై నిరాధారమైన ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖ పై చర్యలు తీసుకోవాలని కేటీఆర్ పరువు నష్టం దావా పిటిషన్ దాఖలు చేశారు. గత విచారణ సందర్భంగా తన గురించి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ కోర్టుకు చదివి వినిపించారు. ఇలా మొత్తం 23 రకాల ఆధారాలను కోర్టుకు అందించిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story