KTR: విమర్శ కేవలం ఎన్నికల జుమ్లానా..? ప్రధాని మోడీపై కేటీఆర్ సంచలన ట్వీట్

by Shiva |
KTR: విమర్శ కేవలం ఎన్నికల జుమ్లానా..? ప్రధాని మోడీపై కేటీఆర్ సంచలన ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికలు (Lok Sabha Elections) బీఆర్ఎస్ పార్టీకి పీడకలను మిగిల్చాయి. పోటీ చేసిన 17 స్థానాల్లో ఒక్కటంటే ఒక్క స్థానాన్ని కూడా ఆ పార్టీ గెలుచుకోలేక డీలా పడిపోయింది. అయితే, లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు ఒకరిపై ఒకరు ఓ రేంజ్‌లో విమర్శలకు దిగారు. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ (BRS) రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మర్చిందని కాంగ్రెస్ (Congress) ఆరోపణలు గుప్పించింది. మరోవైపు తప్పుడు హామీలతో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ అందుకు కౌంటర్ ఇచ్చింది. ఇక ప్రచారం సందర్భంగా రాష్టానికి వచ్చిన ప్రధాని మోడీ అధికారా కాంగ్రెస్ పార్టీని మాత్రమే టార్గెట్ చేశారు. ఓ దశలో తెలంగాణ‌లో ‘ఆర్ఆర్ ట్యాక్స్’ (RR Tax) నడుస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే, అందుకు కౌంటర్‌గా ఇవాళ ట్విట్టర్ వేదికగా ప్రధాని మోడీకి (PM Modi) మాజీ మంత్రి కేటీఆర్ (Former Minister KTR) కౌంటర్ ఇచ్చారు. ‘ప్రధాని మోదీ జీ, మీరు తెలంగాణలో ‘RR టాక్స్’ గురించి మాట్లాడి 4 నెలలకు పైగా అయింది. మీ ప్రభుత్వం ఎటువంటి చర్య తీసుకోకపోవడానికి ఏదైనా నిర్దిష్ట కారణం ఉందా?. తెలంగాణలో కాంగ్రెస్ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతోందని మీరు చెబుతున్నా, మీ కేబినెట్‌లోని కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లు (Kishan Reddy, Bandi Sanjay) ఇద్దరూ ‘ఆర్‌ఆర్‌ టాక్స్‌’, ఇతర కాంగ్రెస్‌ అవినీతి విధానాలకు వ్యతిరేకంగా ఎందుకు ఒక్కమాట కూడా మాట్లాడడం లేదు! వారు మీతో ఏకీభవించలేదా లేక మీ విమర్శ కేవలం ఎన్నికల జుమ్లానా? అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన ట్వీట్ రెండు పార్టీల మధ్య పొలిటికల్ వార్‌కు దారి తీస్తుందా.. వేచి చూడాల్సిందే మరి.

Advertisement

Next Story