అది నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తా: KTR సవాల్

by Satheesh |   ( Updated:2023-01-06 10:30:57.0  )
అది నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తా: KTR సవాల్
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ విరుచుకుపడ్డారు. తెలంగాణ సొమ్ముతో కేంద్రం కులుకుతోందని.. ఎనిమిదేళ్లలో తెలంగాణ కట్టిన పైసలతోనే బీజేపీ పాలిత రాష్ట్రాలను డెవలప్ చేశారని ఆరోపించారు. ఇది నిజం కాదని నిరూపిస్తే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి సవాల్ విసిరారు. ఇక్కడ పన్నులు వసూల్ చేసి.. ఉత్తర భారతదేశంలో పంచడం లేదా అని ప్రశ్నించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సోయి లేకుండా మాట్లాడుతున్నాడని ఫైర్ అయ్యారు. దేశంలో 14 మంది ప్రధానుల కంటే.. ఒక్క మోడీ చేసిన అప్పులే ఎక్కువ అని ఆరోపించారు. బీజేపీ, కాంగ్రెస్ రెండు జాతీయ పార్టీలు అబద్ధాలతోనే కాలం వెళ్లదీస్తున్నాయని అన్నారు.

ఇవి కూడా చదవండి: రవాణా శాఖ మంత్రి సొంత ఇలాకాలోని రవాణా ఆఫీసులోనే అవి లేవంటా!

Advertisement

Next Story