- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
110 సీట్లలో బీజేపీ డిపాజిట్ కోల్పోవడం పక్కా.. ప్రధాని మోడీకి కేటీఆర్ ఛాలెంజ్
దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని మోడీపై మంత్రి కేటీఆర్ విమర్శల వర్షం కురిపించారు. రాజు, యువరాజు అని మాట్లాడిన మోడీకి.. దేవెగౌడ్ కుమారుడు కుమారస్వామి ఎన్డీఏలో చేరినప్పుడు రాచరికం గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. వారితో కలిసి ఉంటే మంచి వాళ్లు.. లేదంటే చెడ్డవాళ్లు అంటారని మండిపడ్డారు. అందుకే బీజేపీని బిగ్గెస్ట్ జుమ్లా పార్టీ అనేది అంటూ కేటీఆర్ విరుచుకుపడ్డారు. బీజేపీ వాట్సాప్ యూనివర్సిటీకి మోడీ వీసీ అని.. మోడీ యాక్టింగ్‌కి ఆస్కార్ అవార్డు పక్కా వస్తుందని సెటైర్ వేశారు.
ఎన్డీఏ నుండి అన్ని పార్టీలు వెళ్లిపోతున్నాయని.. బీజేపీతో కేవలం ఐటీ, ఈడీ, సీబీఐ ఉన్నాయని ఎద్దేవా చేశారు. వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 110 సీట్లలో బీజేపీ డిపాజిట్ కోల్పోతుందని.. దీనిపై ప్రధాని మోడీకి ఛాలెంజ్ చేస్తున్నాని అన్నారు. మోడీ ఎన్ని పిచ్చి మాటలు మాట్లాడినా తెలంగాణ ప్రజలు నమ్మరని.. తెలంగాణలో బీజేపీకి వచ్చేది గుండు సున్నే అన్నారు.