KTR: అరెస్టులతో లగచర్ల లడాయిని ఆపలేరు.. కేటీఆర్ సెన్సేషనల్ కామెంట్స్

by Shiva |   ( Updated:2024-11-12 05:12:35.0  )
KTR: అరెస్టులతో లగచర్ల లడాయిని ఆపలేరు.. కేటీఆర్ సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ఫార్మా కంపెనీ ఏర్పాటుకు అభిప్రాయ సేకరణకు వెళ్లిన వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ (Pratik Jain), అధికారులపై లగచర్ల గ్రామస్థులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం (State Government) దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సోమవారం అర్థరాత్రి పోలీసులు మొత్తం 28 మంది గ్రామస్థులను అదుపులోకి తీసుకుని పరిగి పోలీస్ స్టేషన్‌ (Parigi Police Station)కు తరలించారు. అరెస్ట్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా లగచర్ల (Lagacharla)లో భారీగా పోలీసులను మోహరించారు. అదేవిధంగా దుద్యాల (Dudyala), బొంరాస్‌పేట (Bomraspet), కొడంగల్ (Kodangal) మండలాల పరిధిలో ఇంటర్‌నెట్‌ (Internet)ను నిలిపివేశారు.

అయితే, తాజాగా ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) ‘X’ (ట్విట్టర్) వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. అరెస్టులతో లగచర్ల (Lagacharla) లడాయిని ఆపలేరని.. బెదిరింపులతో రైతులను భయపెట్టలేరని కామెంట్ చేశారు. అర్ధరాత్రి 300 మంది పోలీసులను పంపి రైతులను అరెస్ట్ చేస్తారా.. వాళ్లు ఏమైనా తీవ్రవాదులా అని ప్రశ్నించారు. ఇదేనా ప్రజాస్వామ్య పాలనా.. రైతు సంక్షేమ పాలన అంటూ సీరియస్ అయ్యారు. వెలుగులను తరిమేసి.. చీకట్లు తెచ్చిన ఇందిరమ్మ రాజ్యం ఇదా అని ఎద్దేవా చేశారు. ఫార్మా కంపెనీ (Pharma companies)లు ఏర్పాటు చేసి పచ్చని పొలాలను వల్లకాడు చేయవద్దన్నందుకు రైతులను అరెస్ట్ చేస్తున్నారా అని అన్నారు. వారి అరెస్టులను ఖండిస్తున్నాం.. పోలీసుల చర్యలను వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు. లగచర్ల (Lagacharla) గ్రామస్తుల పోరాటానికి బీఆర్ఎస్ (BRS) అండగా ఉంటుందని హామీ ఇస్తున్నా అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

Advertisement

Next Story