- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫామ్‌హౌజ్‌లో కేసీఆర్‌తో కేటీఆర్, హరీష్‌రావు భేటీ.. ఏం మాట్లాడారంటే..?
దిశ, తెలంగాణ బ్యూరో: వారం రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకొని మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు వచ్చారు. బుధవారం ఎర్రవెల్లి ఫాం హౌజ్‌లో గులాబీ అధినేత కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఢిల్లీలో జరిగిన పరిణామాలను వివరించినట్లు సమాచారం. ఢిల్లీ లిక్కర్ స్కాం ఆరోపణలతో తిహార్ జైలులో ఉన్న కవితతో భేటీ అయిన విషయాలను వివరించారు. బెయిల్ పిటిషన్, అక్కడ పరిస్థితులను అధినేతకు క్షుణ్నంగా వివరించారు. ఇప్పటివరకు కోర్టులో జరిగిన పరిణామాలు పలు అంశాలను వివరించారు. మరోవైపు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అంశాలపైనా అడ్వకేట్లతో భేటీ అయినట్లు సమాచారం.
హిమాచల్ ప్రదేశ్, కర్నాటక రాష్ట్రాల్లోనూ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులు చేయగా, వారిపై సుప్రీంకోర్టుకు వెళ్లడంతో ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసింది. ఆ కేసు వాదించిన న్యాయవాదులతోనూ సమావేశం అయినట్లు వివరించారు. కోర్టు తీర్పును పూర్వపరాలను, కేసు వేసిన దగ్గర నుంచి అనర్హత వేటు పడేవరకు జరిగిన పరిణామాలన్నింటిని క్రోడీకరించిన విషయాలను కేసీఆర్ వివరించారు. భవిష్యత్‌లో ఎవరూ పార్టీ మారకుండా కట్టడిచేసేందుకు ఇదే అనువైన సమయమని, ముందుకు వెళ్దామని తెలిపినట్లు సమాచారం. ఇప్పటికే ఏడుగురు ఎమ్మెల్యేలు చేరగా మిగిలినవారు సైతం ప్రయత్నాలు చేస్తుండటంతో పార్టీ మార్పును సీరియస్‌గా తీసుకుంటుంది.
సుప్రీంకోర్టును, రాష్ట్రపతి అపాయింట్‌మెంట్
రాష్ట్ర హైకోర్టులో దానం నాగేందర్‌తో పాటు తెల్లం వెంకట్రావ్, కడియం శ్రీహరిపైనా అనర్హత వేటు వేయాలని వేసిన పిటీషన్‌పై విచారణ కొనసాగుతుంది. తీర్పు పెండింగ్‌లో ఉంది. మరోవైపు అసెంబ్లీ స్పీకర్‌కు సైతం పార్టీ మారిన ఎమ్మెల్యేలపైనా చర్యలకు పిటీషన్ ఇచ్చారు. వాటిపై స్పష్టత రాకపోవడంతో సుప్రీం కోర్టును ఆశ్రయించేందుకు ప్రయత్నాలు షురూ చేశారు. మరోవైపు రాష్ట్రపతిని సైతం పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి వెళ్లి పార్టీ మారిన ఎమ్మెల్యేలపైనా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసేందుకు సిద్ధమవుతున్నారు.
అందులో భాగంగానే రాష్ట్రపతి అపాయింట్ మెంట్ కోసం చేసిన ప్రయత్నాలను కేసీఆర్‌కు వివరించారు. పార్టీ బలోపేతం, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ కార్యక్రమాలు, సోషల్ మీడియా యాక్టీవ్ తదితర అంశాలపై సుధీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. పార్టీ ఆధ్వర్యంలో ఏయే కార్యక్రమాలు ప్రత్యక్షంగా చేయాలనే అంశాలపైనా ముగ్గురు చర్చించినట్లు సమాచారం. నిరుద్యోగులు, ప్రజలు, ఉద్యోగార్తులు పడుతున్న ఇబ్బందులపైనా గళం ఎత్తాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ప్రజానిరసనలకు మద్దతుగా పాల్గొనాలని నేతలకు సైతం సూచించనున్నారని తెలిసింది.