- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బెల్ట్ షాపుల దందాలో టాప్ ప్లేస్‌లో కోటిపల్లి
దిశ ప్రతినిధి, వికారాబాద్ : జిల్లాలో బెల్ట్ షాపుల పేరిట అక్రమంగా మద్యం అమ్మకాల దందా జోరుగా సాగుతోంది. అయితే జిల్లాలోని కోటిపల్లి మండల కేంద్రంలో అక్రమ మద్యం విక్రయాలు చేస్తున్న వారు మాత్రం మా స్టైల్‌లే వేరంటున్నారు. మమ్మల్ని ఆపేవారు లేరు, పైగా మద్యం అమ్మకాల్లో మేమే నెంబర్ 1 అని, అవసరం అయితే మాకు ఉత్తమ అవార్డు కూడా ఇవ్వాలని అని గర్వంగా చెప్పుకొవడం గమనార్హం.
పూర్తి వివరాల్లోకి వెళ్తే నాలుగేళ్ల క్రితం వరకు కోటిపల్లి మండల కేంద్రంలో మద్యం దొరకని పరిస్థితి ఉండేది. ఉన్న ఒక్క వైన్స్ సమయానికి మూసివేస్తే మద్యం అనేదే దొరికేది కాదు. బెల్ట్ షాపులు కొన్ని ఉన్న వాటికీ పెద్దగా ఆదరణ ఉండేది కాదు. కానీ నేడు కోటిపల్లి మండలం బెల్ట్ షాపుల పేరుతో అక్రమ మద్యం విక్రయాల్లో జిల్లాలోనే నెంబర్ 1 అన్నట్లుగా దూసుకెళ్తుందనే టాక్ వినిపిస్తుంది.
దాబాలా పేరుతో ప్రధాన రోడ్డు పక్కనే దందా
ఫామిలీ దాబాల పేరుతో ప్రధాన రోడ్డుపక్కనే బార్ అండ్ రెస్టారెంట్‌ల స్థాయిలో బెల్ట్ షాపులు నడిపిస్తున్న ఆబ్కారీ శాఖ అధికారులు ఎవ్వరూ కూడా అటూ చూడటం లేదని తెలుస్తోంది. దాంతో ఎలాంటి లిక్కర్ అనుమతులు లేకుండానే బార్ అండ్ రెస్టారెంట్‌ల మాదిరి కౌంటర్లు ఏర్పాటు చేసి మరి మంద్యం ప్రియులకు స్వర్గం అందిస్తున్నారు.
మద్యమే కాకుండా వారి దగ్గర దొరికే ఫుడ్ ఐటమ్స్‌కు స్టార్ హోటల్ రేంజ్‌లో నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు వసూలు చేస్తుంటే ఎవ్వరూ పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసులు కూడా ఇటు వైపు చూడడం లేదని ఆరోపణలు ఉన్నాయి. మండల కేంద్రంలో ఇంత జోరుగా మద్యం దందా నడుస్తుంటే ఆబ్కారీ, పోలీసు, తూనికలు కొలతలు, ఫుడ్ ఇన్స్ పెక్షన్, గ్రామపంచాయితీ లాంటి సంబంధిత శాఖల అధికారులు ఒక్కరంటే ఒక్కరు కూడా నిబద్దతతో పనిచేయడం లేదని ప్రజలు, ముఖ్యంగా మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వాళ్ల ఇంట్లోనే అద్దెకు పోలీసులు
స్థానిక మండల నాయకుల అండదండలు, మండల అధికారుల అండదండలు పుష్కలంగా ఉండడంతో మండలంలో, ముఖ్యంగా మండల కేంద్రంలో అక్రమ మద్యం వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా నడుస్తోందని తెలుస్తోంది. ఈ కారణంగా జిల్లాలోనే అత్యంత కమర్షియల్ జోన్‌గా పేరుగాంచిన కోటిపల్లి మండల కేంద్రంలో స్టార్ హోటల్ రేంజ్‌లో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కొన్ని దాబాలు షాపులలో బ్రాండెడ్ కానీ వాటర్ బాటిల్స్ అమ్మకాలు జోరుగా నడుతున్నట్లు తెలుస్తుంది.
మండల కేంద్రంలో అక్రమంగా మద్యం అమ్ముతున్న రెండు బెల్ట్ షాపుల యజమానుల ఇంట్లోనే ఇద్దరు పోలీసులు అద్దెకు ఉండటం కొసమెరుపు. అక్రమాలను అరికట్టాల్సిన పోలీసులే దగ్గరుండి వారిని ప్రోత్సహించడం ఏంటని ప్రతిపక్ష నాయకులతో పాటు జనం ఫైర్ అవుతున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకొని కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కోటిపల్లి మండలానికి వచ్చిన చెడ్డపేరును తొలిగించేలా చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.
అనుమతి లేకుండా మద్యం అమ్మితే చర్యలు :
తాండూర్ ఆబ్కారీ సీఐ
ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా బెల్ట్ షాపులు, ఫ్యామిలీ దాబాల పేరుతో ప్రధాన రోడ్డుపక్కన చట్టవిరుద్ధంగా మద్యం అమ్మకాలు జరిపితే అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఎవ్వరూ కూడా నిబంధనలు ఉల్లంఘించరాదని ఈ సందర్బంగా సిఐ హెచ్చరించారు.