విద్యుత్ శాఖలో కాళేశ్వరం కంటే పెద్ద స్కామ్: కొండా విశ్వేశ్వర్ రెడ్డి

by Satheesh |   ( Updated:2023-12-08 16:25:42.0  )
విద్యుత్ శాఖలో కాళేశ్వరం కంటే పెద్ద స్కామ్: కొండా విశ్వేశ్వర్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో విద్యుత్ శాఖ రూ.లక్ష కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం కంటే అతిపెద్ద స్కామ్ ఇదేనని ఆయన ట్విట్టర్ వేదికగా శుక్రవారం పేర్కొన్నారు. 2014 నాటికి డిస్కంలు రూ.2,281 కోట్ల నష్టాల్లో ఉండేవని ఆయన తెలిపారు. 2022 నాటికి అవి రూ.45,000 కోట్లకు చేరిందని వెల్లడించారు. 2023 నాటికి ఇది రూ.50 వేల కోట్ల అప్పులకు చేరుకుందని పేర్కొన్నారు. గత తెలంగాణ ప్రభుత్వం డిస్కంలకు రూ.20,871 కోట్లు బాకీ ఉందని వెల్లడించారు. అందులో ఇరిగేషన్ శాఖవి రూ.9268.21 కోట్లు, పంచాయతీరాజ్ శాఖవి రూ.6353.14 కోట్లు, మున్సిపాలిటీలవి రూ.1502.65 కోట్లు, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లయ్ అండ్ సీవరేజ్ బోర్డుకు సంబంధించినవి రూ.2857.65 కోట్లు, కేంద్రానికి రూ.658.24 కోట్లు, ఇతరత్రా కలిపి మొత్తం 20,871.03 కోట్లు బాకీ పడిందని ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా సింగరేణి ట్రాన్స్ కోకు, జెన్ కోకు బొగ్గు సరఫరా చేసిందని ఆయన తెలిపారు. కాగా 2019 నాటికి ట్రాన్స్ కో సింగరేణికి రూ.5 వేల కోట్ల బాకీ పడిందని ఆయన తెలిపారు. అలాగే జెన్ కో రూ.2600 కోట్లు బాకీ ఉందన్నారు. ఇప్పటి వరకు ఈ బాకీ డబుల్ అయి ఉంటుందని కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆరోపణలు చేశారు.

Advertisement

Next Story

Most Viewed