లోక్‌సభ బీజేపీ విప్‌గా కొండా విశ్వేశ్వర్ రెడ్డి

by Mahesh |   ( Updated:2024-07-30 01:36:27.0  )
లోక్‌సభ బీజేపీ విప్‌గా కొండా విశ్వేశ్వర్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో : చేవెళ్ల ఎం.పి. కొండా విశ్వేశ్వర్ రెడ్డికి లోక్‌సభలో అరుదైన గౌరవం దక్కింది. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి లోక్ సభ‌లో విప్‌గా ఆయనకు ఛాన్స్ ఇచ్చింది. ఈ మేరకు భారతీయ జనతా పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి లోక్ సభ స్పీకర్‌కు పార్టీ తరుపున చీఫ్ విప్, విప్‌లుగా నియమించిన ఎంపీల పేర్లను సర్కులేట్ చేశారు. తెలంగాణ రాష్ట్రం నుండి లోక్ సభ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డికి విప్‌గా అవకాశం దక్కడంతో బీజేపీ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. ముఖ్యంగా చేవెళ్ల ఎంపీ నియోజకవర్గంలో ఆయన అనుచరులు, పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed