- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొండా సురేఖ అక్కినేని కుటుంబానికి బహిరంగ క్షమాపణలు చెప్పాలి: పోసాని కృష్ణమురళి
దిశ, సినిమా: తెలంగాణ మంత్రి కొండా సురేఖ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై పలు కామెంట్స్ చేసిస సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నాగచైతన్య, సమంత విడాకులు తీసుకోవడానికి కారణం కేటీఆర్ అని, అలాగే నాగార్జున కుటుంబంపై కూడా పలు అనుచిత వ్యాఖ్యలు చేసింది. ఇక ఈ వ్యాఖ్యలు గత కొద్ది రెండు మూడు రోజుల నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీలో దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే సమంత, నాగార్జున, నాగచైతన్య, అమల, అఖిల్ స్పందించారు. అలాగే వీరికి సపోర్ట్‌గా నిలుస్తూ పలువురు సినీ సెలబ్రిటీలు సంచనల పోస్టులు పెట్టి తమ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కొండా సురేఖ మాత్రం మరోసారి సమంత, నాగచైతన్యలపై సంచలన ఆరోపణలు చేసింది. దీనికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట వైరల్ అవుతోంది.
ఇదిలా ఉంటే.. తాజాగా, కొండా సురేఖ, సమంత వ్యవహారంపై టాలీవుడ్ సీనియర్ నటుడు పోసాని కృష్ణ మురళి స్పందించారు. ‘‘అకారణంగా కొండా సురేఖ 30 ఏళ్లుగా తెలుసు. వాళ్ల భర్త మురళి కూడా మంచోడు. అయితే ఆమె ఎందుకు నోరుజారిందో సురేఖనే ఆలోచించుకోవాలి. అనకూడని కామెంట్లు చేసింది. నాగార్జున మంచి వ్యక్తి.. నాకు 40 ఏళ్లుగా తెలుసు అలాంటి వ్యక్తి కుటుంబం పై అనుచిత వ్యాఖ్యలు చేయడం తప్పు. అలాగే రకుల్ ప్రీత్ సింగ్ అనే నటి పెళ్లి చేసుకుని ముంబైలో ఉంటుంది.
కొండా సురేఖ అన్న ప్రతి మాట వాళ్లను భాదపెట్టాయి. కాబట్టి ప్రెస్‌మీట్ పెట్టి ఆ ఆడవాళ్లు నా సోదరితో సామానులు అనండి. నాగార్జునను కూడా సోదరుడు అని చెప్పి సింపుల్‌గా ఆవేశంలో అన్నాను అని బహిరంగ క్షమాపణలు చెప్పండి. మీరు మంచి వారు కాబట్టి నేను మిమ్మల్ని బ్రతిమిలాడుతున్నాను కొండా సురేఖ’’ అని చెప్పుకొచ్చారు. ప్రజెంట్ పోసాని కృష్ణమురళికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.