- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీఆర్ఎస్కి కొత్త అర్థం చెప్పిన మాజీ మంత్రి Konda Surekha..
దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ కేసుల నుంచి తప్పించుకునేందుకే జాగృతిని అడ్డుకుపెట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారని సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవితపై కాంగ్రెస్ సీనియర్ నేత కొండా సురేఖ విమర్శలు గుప్పించారు. జాగృతి పేరుతో కవిత దేశ, విదేశాల నుంచి కోట్లాది రూపాయాలను దోచుకున్నది నిజం కాదా? అని సురేఖ ప్రశ్నించారు. విదేశాల్లో బతుకమ్మలు ఆడుతూ కోట్లు దండుకున్నారని తీవ్ర స్థాయిలో ఆరోపించారు. రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చాక జాగృతిని పట్టించుకోలేదని అన్నారు. లిక్కర్ స్కాంలో సీబీఐ అరెస్ట్ చేస్తుందనే భయంతోనే కవిత మళ్లీ జాగృతిని రంగంలోకి దింపారని ఆరోపించారు.
ఇకపోతే, మేధావుల సలహాలు, సూచనలను సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదని.. అందుకే వారు సైలెంట్ అయిపోయారని కొండా సురేఖ తెలిపారు. సీఎం ఏది అనిపిస్తే అదే చేస్తారని అన్నారు. తెలంగాణ కోసం వందలాది మంది విద్యార్థులు ప్రాణత్యాగం చేశారని.. వారి త్యాగాలను చూసే సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారని గుర్తుచేశారు. రాష్ట్రం ఏర్పడ్డాక సంపదను దోచుకుంటూ కల్వకుంట్ల కుటుంబం ఒక్కటే బాగు పడిందన్నారు. తెలంగాణను దోచుకున్నది చాలదన్నట్టు.. దేశాన్ని దోచుకోవడానికి కేసీఆర్ టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చారని చెప్పారు. బీఆర్ఎస్ అంటే భారత రాబడి పార్టీగా మారిందని ఆరోపించారు.