Konda Surekha: రాహుల్ గాంధీ కులంపై వ్యాఖ్యలు.. ఏలేటి మహేశ్వర్ రెడ్డికి కొండా సురేఖ కౌంటర్

by Prasad Jukanti |
Konda Surekha: రాహుల్ గాంధీ కులంపై వ్యాఖ్యలు.. ఏలేటి మహేశ్వర్ రెడ్డికి కొండా సురేఖ కౌంటర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఏఐసీసీ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) కులాన్ని ఉద్దేశించి బీజేఎల్పీ నేత ఏలేటీ మహేశ్వర్ రెడ్డి (Alleti Maheshwar Reddy) చేసిన వ్యాఖ్యలకు మంత్రి కొండా సురేఖ (Konda Surekha) కౌంటర్ ఇచ్చారు. రాహుల్ గాంధీది ఏ కులమో కావాలంటే ఆయన ఇంటికి వెళ్లి అడగండి అంటు సీరియస్ అయ్యారు. రాహుల్ గాంధీ కులంతో బీజేపీ నేతలకు ఏం పని అని ప్రశ్నించారు. కులగణన ఫారమ్ తీసుకుని వెళ్తే రాహుల్ గాంధే తన కులం ఏంటో చెబుతారన్నారు. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టే పార్టీ బీజేపీ అని ధ్వజమెత్తారు. బుధవారం మీడియాతో మాట్లాడిన సురేఖ.. కులవివక్ష పోవాలంటే కులగణన జరగాలని రాహుల్ గాంధీ చెబుతున్నారన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కులగణన (Caste Census) ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు.

కాగా ఇవాళ మీడియాతో మాట్లాడుతూ ఏలేటి మహేశ్వర్ రెడ్డి ‘అసలు రాహుల్ గాంధీది ఏ కులమో, ఏ మతమో చెప్పాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ తాత పేరు ఫిరోజ్ జహంగీర్ గాంధీ. రాహుల్ హిందువో.. ముస్లీమో చెప్పాలి. ఫిరోజ్ జహంగీర్ గాంధీ మనవడు రాహుల్ జహంగీర్ గాంధీ కావాలి కదా’ అని అన్నారు. రాజకీయాల్లో ఉన్న రాహుల్ తన కులం, మతం ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed