Big Breaking: బీఆర్ఎస్‌కు షాక్.. తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొణతం దిలీప్ అరెస్ట్

by Ramesh N |   ( Updated:2024-11-18 11:07:58.0  )
Big Breaking: బీఆర్ఎస్‌కు షాక్.. తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొణతం దిలీప్ అరెస్ట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొణతం దిలీప్‌ను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిసింది. హైదరాబాద్ సీసీఎస్‌‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. సైబర్ క్రైమ్ పోలీసులు కొణతం దిలీప్‌ను అరెస్ట్ చేసి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే ముందు ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారని బీఆర్ఎస్ పార్టీ తెలిపింది. గతంలో ప్రభుత్వం పెట్టిన కేసుల నిమిత్తం ఈ రోజు ఉదయం సీసీఎస్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన కొణతం దిలీప్‌ను అక్రమంగా అరెస్టు చేసినట్లు బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. కాగా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అనుచరుడిగా, బీఆర్ఎస్ సోషల్ మీడియా హెడ్‌గా కొణతం దిలీప్ ఉన్నారు. గతంలో ఆసిఫాబాద్ జైనూర్ ఘటనలో సోషల్ మీడియా ద్వారా రెచ్చగొట్టే పోస్టులు చేశారని సైబర్ క్రైమ్ పోలీసులు కొణతంను అరెస్టు చేశారు. అనంతరం ఆయన బెయిల్‌పై బయటకు వచ్చారు. తాజాగా మరోసారి ఆయన్ను అరెస్ట్ చేసినట్లు తెలిసింది. అయితే ఏ కేసులో అదుపులోకి తీసుకున్నారనేది సైబర్ క్రైమ్ పోలీసులు ఎలాంటి ప్రకటన చేయలేదు.

కొణతం దిలీప్ అరెస్ట్‌పై మాజీ మంత్రి హరీశ్ రావు స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరిత, ప్రతీకార చర్యలను మానుకోవాలని సూచించారు. ప్రజా ప్రభుత్వం అని ప్రచారం చేసుకుంటూ.. అప్రజాస్వామికంగా వ్యవహరించడం దుర్మార్గమన్నారు. ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెట్టి వేధించడం సిగ్గుచేటని విమర్శించారు. తెలంగాణ ఉద్యమకారుడు కొణతం దిలీప్ అరెస్టు‌ను తీవ్రంగా ఖండిస్తున్నామని, వెంటనే విడుదల చేయాలని ఇవాళ ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు.

Advertisement

Next Story