- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మునుగోడు నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భార్య పోటీ..? క్లారిటీ వచ్చేసింది
దిశ, వెబ్‌డెస్క్: మునుగోడు నియోజకవర్గం రాష్ట్రవ్యాప్తంగా మరోసారి హాట్‌టాపిక్‌గా నిలిచింది. ఏడాది క్రితం ఉపఎన్నికలు జరగడంతో ఈ సెగ్మెంట్ గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ చర్చించుకోగా.. అసెంబ్లీ ఎన్నికల వేళ ఇప్పుడు మరోసారి అందరి దృష్టి పడింది. దానికి కారణం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. బైపోల్‌లో పోటీలోకి దిగి ఓటమి చెందిన ఆయనకు అసెంబ్లీ అభ్యర్థుల బీజేపీ తొలి జాబితాలో చోటు దక్కలేదు. గత కొంతకాలంగా బీజేపీకి దూరంగా ఉన్న ఆయనకు టికెట్ కేటాయించకపోవడంతో కాషాయ పార్టీని వీడుతారనే ప్రచారం తెరపైకి వచ్చింది.
కాంగ్రెస్‌లో చేరేందుకు రాజగోపాల్ రెడ్డి సిద్దమయ్యారని, హస్తం నేతలతో సంప్రదింపులు కూడా పూర్తైనట్లు వార్తలొస్తున్నాయి. రేపో, మాపో ఢిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోవడం ఖాయమని ఊహాగానాలు హల్‌చల్ చేస్తోన్నాయి. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు కూడా దీనికి బలం చేకూరుస్తున్నాయి. మునుగోడులోని అన అనుచరులు, అభిమానులు కాంగ్రెస్‌లో చేరాలని ఒత్తిడి తీసుకొస్తున్నారని, పండుగ తర్వాత కీలక నిర్ణయం ప్రకటిస్తానని ఇటీవల చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. దీంతో ఆయన హస్తం గూటికి చేరడం లాంఛనమేనని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
వచ్చే ఎన్నికల్లో తాను పోటీకి దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఉపఎన్నికల్లో పరాజయం పాలవ్వడంతో మునుగోడు నుంచి తన భార్య లక్ష్మిని పోటీలోకి దింపాలని రాజగోపాల్ రెడ్డి భావిస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది. తాను పోటీ చేయనని రాజగోపాల్ రెడ్డి చెప్పడంలో.. భార్యను బరిలోకి దించుతున్నారనే క్లారిటీ పరోక్షంగా ఇచ్చారని అంటున్నారు.బైపోల్ సమయంలో మునుగోడు నియోజకవర్గంలో లక్ష్మి విస్తృతంగా ప్రచారం చేశారు. నియోజకవర్గ ప్రజలతో ఆమెకు సంబంధాలు ఏర్పడ్డాయి. దీంతో తన భార్యను బరిలోకి దింపితే బాగుంటుందనే ఆలోచనలో రాజగోపాల్ రెడ్డి ఉన్నట్లు అనుచరులు చెబుతున్నారు. త్వరలో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.