- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'వచ్చే ఏడాది తీహార్ జైల్లో MLC కవిత బతుకమ్మ ఆట'
దిశ, సంస్థాన్ నారాయణపురం: ఇప్పటివరకు తెలంగాణలో బతుకమ్మ ఆడిన MLC కవిత.. వచ్చే ఏడాది తీహార్ జైల్లో ఆడుతుందని మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. మన అందరి ముందు బతుకమ్మ ఆడుతున్న కవితకు ఢిల్లీలో ఆరు వందల లిక్కర్ షాప్‌లు ఉన్నాయని అన్నారు. శనివారం మండల పరిధిలోని గుజ్జ, మల్లారెడ్డి గూడెం, సర్వేలు, అల్లందేవి చెరువు, చిమిర్యాల, గుడిమల్కాపురం, నారాయణపురం గ్రామాల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రచారం కొనసాగింది. ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. కొంపలు ముంచే టీఆర్ఎస్ ప్రభుత్వం మనకు అవసరమా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక తాగుబోతని, రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం షాపులు తెరిచి మహిళలపై పుస్తెలతాడులు తెంపుతున్నాడని అన్నారు.
రాష్ట్రంలో రైతుబంధు కౌలు రైతులకు కూడా ఇవ్వాలని తాను కొట్లాడినా ముఖ్యమంత్రి స్పందించలేదన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వసతులు సరిగా లేక నిరుపేద కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని మండిపడ్డారు. కేసీఆర్‌ను గద్దె దించి, టీఆర్ఎస్‌ను బొంద పెట్టాలని, పేదల కష్టాలు పోవాలంటే కాషాయం జెండా ఎగరాలన్నారు. కేసీఆర్ కుటుంబం దోచుకున్న లక్ష కోట్లను కక్కించి జైలుకు పంపిస్తామని అన్నారు. కేటీఆర్ మునుగోడును దత్తత తీసుకుంటానని అంటున్నాడని, ఇక్కడ ఉన్న అభ్యర్థికి సత్త లేదా అని ప్రశ్నించారు. అమిత్ షాతో మాట్లాడి చౌటుప్పల్‌లో మల్టీ స్పెషలిటీ ఆసుపత్రి, నారాయణపురంలో హ్యాండ్లూమ్ పార్కుకి హామీ తీసుకున్నానని తెలిపారు. మునుగోడులో జరిగేది రాజకీయ ఎన్నిక కాదని ఇది ఒక ధర్మ యుద్ధం అని అన్నారు. మునుగోడు తీర్పు తెలంగాణ భవిష్యత్‌కి పునాదని, మునుగోడు ఓటర్లు చరిత్రలో నిలిచిపోయేలా కమలం పువ్వుకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట ప్రచారంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, శాసనమండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి
1. నవంబర్ 3 తర్వాత KCR, KTR కనబడరు: మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు