'ఎమ్మెల్యేలను కొన్నందుకు టీఆర్ఎస్‌కు ఓటు వేయాలా?'

by GSrikanth |
ఎమ్మెల్యేలను కొన్నందుకు టీఆర్ఎస్‌కు ఓటు వేయాలా?
X

దిశ, డైనమిక్ బ్యూరో: మునుగోడు ఉప ఎన్నికకు నగారా మోగింది. దీంతో ప్రధాన పార్టీలు ప్రచారంపై దృష్టి సారించాయి. ఈ క్రమంలో బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మునుగోడులో ఓటు ఎవరికి వేయాలని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. పక్క పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను సంతలో కొన్నట్టు కొన్న టీఆర్ఎస్‌కా? ప్రజలు గెలిపించినా అధికారం కోసం గోడలు దూకే నాయకులు ఉన్న కాంగ్రెస్‌కా?, పార్టీ మారాలంటే రాజీనామా చేయాలన్న సిద్దాంతానికి కట్టుబడి ఉండే బీజేపీకా? అని అన్నారు. అధికారంలో ఉండి టీఆర్ఎస్ ఏమీ చేయలేకపోయిందని విమర్శలు గుప్పించారు. అంతకు ముందు సోమవారం మంత్రి కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. మునుగోడు ఉప ఎన్నికలో పోటీ ఎవరి మధ్య, ప్రజలు ఎవరివైపు అంటూ కేటీఆర్ ట్విట్టర్‌లో ఓ పోస్ట్ చేశారు. ఫ్లోరోసిస్ భూతాన్ని నల్గొండ బిడ్డలకు శాపంగా ఇచ్చిన కాంగ్రెస్ పక్షానా? ఈ వ్యాధి నిర్మూలనకు నీతి ఆయోగ్ సిఫార్సు చేసినా మిషన్ భగీరథకు పైసా ఇవ్వని బీజేపీ వైపా? ఫ్లోరోసిస్ నుంచి మిషన్ భగీరథ ద్వారా శాశ్వత విముక్తి కల్పించిన టీఆర్ఎస్ వైపు ఉంటారా అని మునుగోడు ఓటర్లను ఉద్దేశించి కేటీఆర్ అడిగారు. ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి తాజాగా చేసిన ట్వీట్ మంత్రి కేటీఆర్ కు కౌంటర్ ట్వీట్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story