తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పుపై కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

by Satheesh |   ( Updated:2023-05-18 08:56:33.0  )
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పుపై కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పుపై ఆ పార్టీ నేత రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్‌ని మార్చాలని ఎలాంటి లాబీయింగ్ జరగడం లేదని క్లారిటీ ఇచ్చారు. అధ్యక్షుడిగా బండి సంజయ్ తన మూడేళ్ల పదవి కాలాన్ని పూర్తి చేసుకున్నారని గుర్తు చేశారు.

బీజేపీలో ఎలాంటి లాబియింగ్‌లు ఉండవని.. ఇది ఎలక్షన్స్ ఇయర్ కావడం చేత బండి సంజయ్ సేవలను మరో రూపంలో పార్టీ వాడుకోవాలని భావిస్తే అలాంటప్పుడు మాత్రమే అధ్యక్షుడు మారుతాడే తప్ప లాబీయింగ్‌ల ద్వారా మార్పు జరగదని స్పష్టం చేశారు. తాను ఎక్కడా అమ్ముడు పోయే వ్యక్తిని కాదని.. దగా పడిన తెలంగాణను కాపాడటమే తన లక్ష్యం అన్నారు. కర్ణాటక ఫలితాలతో సినిమా స్టైల్‌లో టీ కాంగ్రెస్‌లో ఏమి జరగదన్నారు. నరేంద్ర మోడీ, అమిత్ షా నేతృత్వంలో కేసీఆర్‌ను గద్దె దింపుతామన్నారు. తెలంగాణలో కేసీఆర్‌ను గద్దె దించడం కోసమే తాను బీజేపీలో చేరానని తెలిపారు.

Also Read..

రాహుల్ గాంధీ, సోనియా గాంధీ అంటే అభిమానం: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Advertisement

Next Story