- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఎమ్మెల్యేగా పోటీ చేయడంపై క్లారిటీ ఇచ్చిన MP కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కాంగ్రెస్ కీలక నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్నట్లు తన మనసులోని మాటను వెంకట్ రెడ్డి ఢిల్లీ వేదికగా బయటపెట్టారు. మంగళవారం ఢిల్లీలో జరిగిన తెలంగాణ కాంగ్రెస్ స్ట్రాటజీ కమిటీ భేటీలో ఎంపీ వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఎన్నికల యాక్షన్ ప్లాన్‌ను కాంగ్రెస్ సిద్ధం చేసిందని తెలిపారు. సర్వేల ఆధారంగానే ఈ సారి టికెట్ల కేటాయింపు ఉంటుందని పేర్కొన్నారు. త్వరలోనే క్లారిటీ ఉన్న సీట్ల ప్రకటన ఉంటుందని చెప్పారు.
వచ్చే నెల చాలా నియోజక వర్గాల అభ్యర్థుల ప్రకటన ఉంటుందని వెల్లడించారు. తెలంగాణలో రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్‌తో కాంగ్రెస్ పార్టీ పొత్తు ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో జనరల్ స్థానాల్లో బీసీ, ఎస్టీ, ఎస్సీలకు అవకాశం కల్పించాలని రాహుల్ గాంధీని కోరానని.. దానికి ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పారు. భవిష్యత్‌లో ఎప్పుడు రమ్మంటే అప్పుడు తెలంగాణకు వస్తానని రాహుల్ గాంధీ చెప్పారని కోమటిరెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ అవినీతి లెక్కలన్నీ బయటకు తీయాలని.. కేసీఆర్ కుటుంబ అవినీతి ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. ఇక, తన సోదరుడు, బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గురించి తనకు తెలియదని వెంకట్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.