ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీఖాన్.. మరోసారి కేబినెట్‌లో తీర్మానం

by GSrikanth |
ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీఖాన్.. మరోసారి కేబినెట్‌లో తీర్మానం
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ప్రొఫెసర్ కోదండరాం, జర్నలిస్టు అమీర్ అలీఖాన్‌ల పేర్లను కేబినెట్‌ మరోసారి తీర్మానించింది. హైకోర్టు ఆదేశాలతో ఈ రెండు పేర్లను రాష్ట్ర ప్రభుత్వం మరోసారి గవర్నర్ తమిళిసై‌కి పంపించనుంది. కాగా, గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకాలపై ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు షాకిచ్చిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నియమించిన దాసోజు శ్రవణ్, సత్యనారాయణల నియామకాన్ని కొట్టి వేసే అధికారం గవర్నర్‌కు లేదని హైకోర్టు పేర్కొంది. కేబినెట్‌కు తిప్పి పంపాలి తప్ప తిరస్కరించకూడదని అభిప్రాయపడింది. మళ్లీ కొత్తగా ఎమ్మెల్సీల నియామకం చేపట్టాలని హైకోర్టు తీర్పులో పేర్కొంది. దీంతో మరోసారి ఎమ్మెల్సీల పేర్లను కేబినెట్‌లో ప్రతిపాదించిన సర్కార్.. గవర్నర్‌కు పంపించనుంది.

Advertisement

Next Story