వచ్చే ఏడాది నుంచి ప్రతి మండలంలో.. రాష్ట్రమంతా పండగ వాతావరణం

by Ramesh Goud |   ( Updated:2024-01-16 14:59:16.0  )
వచ్చే ఏడాది నుంచి ప్రతి మండలంలో.. రాష్ట్రమంతా పండగ వాతావరణం
X

దిశ వెబ్ డెస్క్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ ను మూడు రోజుల పాటు పరేడ్ గ్రౌండ్స్ లో విజయంతంగా నిర్వహించింది. ఈ పతంగుల ఫెస్టివల్‌ లో 16 దేశాలకు చెందిన 40 మంది ఇంటర్నేషల్ ప్లేయర్లు, 60మంది నేషనల్ కైట్ ఫ్లయర్స్ పాల్గొన్నారు. ఈ కైట్ ఫెస్టవల్ కు ఉచిత ప్రవేశం కల్పించడంతో చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ చూసేందుకు, పాల్గొనేందుకు పరేడ్ గ్రౌండ్స్ కి చేరుకున్నారు. పెద్ద ఎత్తున సక్సెస్ అయిన ఈ భారీ ఈవెంట్ పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

వచ్చే ఏడాది నుంచి ఒక్క హైదరాబాద్ లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలంలోనూ ఈ పెద్ద ఈవెంట్ ను జరిపేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు అంతటా విస్తరించేలా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. పెద్ద పండుగలకు సొంత ఇళ్లకు వెళ్లలేని వారందరికీ ఒక వేదిక ఏర్పాటు చేసి, రాష్ట్రమంతా పండగ వాతావరణం కనిపించేలా కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని మంత్రి తెలిపారు.

Advertisement

Next Story