కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన

by Gantepaka Srikanth |
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో నవంబర్ 1వ తేదీ నుంచి ప్రజాసమస్యలపై ఉద్యమిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) కీలక ప్రకటన చేశారు. గ్రామ స్థాయి నుంచి కమిటీలు చేస్తామని అన్నారు. రేవంత్ రెడ్డి(Revanth Reddy) పాలన కూడా కేసీఆర్(KCR) తరహాలోనే ఉందని మండిపడ్డారు. ఒక్క ఇళ్లు కట్టలేదు. పేదలకు ఒక్క ఇళ్లు పంచలేదు కానీ కూల్చుతున్నారని సీరియస్ అయ్యారు. కర్ణాటకలో ఐదు గ్యారంటీలు అని రోడ్డునపడేశారరు. హిమాచల్ ప్రదేశ్‌లో హామీల పేరుతో దివాలా తీయించారు. ఇప్పుడు తెలంగాణను అదే తరహాలో తీసుకెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీ డ్రైనేజీకి ప్రత్యామ్నాయం చూపించాలని డిమాండ్ చేశారు. బంగారంతో సుందరీకరణ చేస్తారా? అని ప్రశ్నించారు.

ఫోర్త్ సిటీ, ఫార్మాసిటీలపై స్పష్టత లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వ తప్పుడు విధానాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే కేంద్రంపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. అసలు సింగరేణిని ప్రయివేటు పరం చేయాలనే ఆలోచన కేంద్రానికి లేనే లేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ హయాంలోనే గనులు ప్రయివేటుకు ఇచ్చారని గుర్తుచేశారు. ఫిరాయింపులను కూడా కేసీఆరే ప్రారంభించారని అన్నారు. అదే దారిలో ఇప్పుడు రేవంత్ వెళుతూ.. ఫిరాయింపులను ప్రొత్సహిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో మారింది కేవలం జెండానే అని.. అజెండా కాదని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed