కాంగ్రెస్ అంటేనే సామాన్యులపై భారం.. పెట్రోల్ ధరలు పెంచడంపై కిషన్ రెడ్డి ఫైర్

by Prasad Jukanti |
కాంగ్రెస్ అంటేనే సామాన్యులపై భారం.. పెట్రోల్ ధరలు పెంచడంపై కిషన్ రెడ్డి ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ అంటేనే అధిక ఇంధన ధరలు, అధిక ద్రవ్యోల్భణం, సామాన్య ప్రజలపై భారం అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. కర్నాటకలో ఇంధన ధరలపై పన్ను పెంచడంపై కిషన్ రెడ్డి ఆదివారం ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఎన్నికలు ముగియగానే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇంధన ధరలు పెరుగుతున్నాయని ధ్వజమెత్తారు. కర్నాటకలో లీటర్ పెట్రోల్ ధర రూ.103.44 ఉంటే తెలంగాణలో రూ.109.41 ఉందని అదే బీజేపీ పరిపాలిస్తున్న గుజరాత్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.94.44 , ఉత్తర ప్రదేశ్ లో రూ.94.70, ఉత్తరాఖండ్ లో రూ. 93.82, హర్యాణాలో రూ.95.46, గోవాలో రూ.95.36 ఉందన్నారు. కాగా కర్నాటక ప్రభుత్వం జూన్ 15 నుంచి పెట్రోల్, డీజిల్‌పై పన్ను పెంచింది. దీంతో ఇంధన ధరలు రూ.3 పెరిగాయి. కొత్త ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని కర్ణాటక ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ నిర్ణయాన్ని బీజేపీ తప్పుబడుతోంది. ఎన్నికలు ముగియగానే ప్రజలపై కాంగ్రెస్ సర్కార్ భారం మోపుతోందని దుయ్యబడుతోంది.

Advertisement

Next Story

Most Viewed