2024 దేశానికి ఎంతో ముఖ్యం: కిషన్ రెడ్డి

by GSrikanth |
2024 దేశానికి ఎంతో ముఖ్యం: కిషన్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఆంగ్ల నూతన సంవత్సరం 2024 దేశానికి ఎంతో ముఖ్యమైన సంవత్సరంగా కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర​అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెప్పారు. తెలంగాణ ప్రజలకు కిషన్ రెడ్డి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. 2024 దేశానికి ఎంతో కీలకం కానుందని, పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయని ఆదివారం వెల్లడించారు. ప్రధాని మోడీ ఈ ఏడాది హ్యాట్రిక్ సాధించబోతున్నారని తెలిపారు. మోడీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతోందని పేర్కొన్నారు. ప్రజల ఆత్మగౌరవాన్ని, దేశ ప్రతిష్టను పెంచేలా అనేక చర్యలు చేపడుతున్నారని వెల్లడించారు. పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు చేపడుతూ మోడీ ప్రభుత్వం ముందుకు వెళ్తోందని కిషన్ రెడ్డి స్పష్టంచేశారు.

Advertisement

Next Story