మభ్యపెట్టి ఆశపెట్టే పార్టీ కాదు బీజేపీ: కిషన్ రెడ్డి

by karthikeya |
మభ్యపెట్టి ఆశపెట్టే పార్టీ కాదు బీజేపీ: కిషన్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రజలను మభ్యపెట్టి, ఆశపెట్టి పార్టీలోకి చేర్చుకోవాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీకి లేదని, మిగిలిన పార్టీలకు బీజేపీకి చాలా తేడా ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన ప్రసంగిస్తూ.. కొన్ని రాజకీయ పార్టీలు సభ్యత్వ నమోదు చేస్తే ఇన్స్యూరెన్స్ సౌకర్యం కల్పిస్తామంటూ ఆశపెట్టి పార్టీ సభ్యత్వాలు ఇస్తున్నాయన్న ఆయన.. పార్టీ కన్నా దేశమే గొప్పదని, దేశ హితం కోసం పాటు పడే బీజేపీ మాత్రేనని అన్నారు. ఒకప్పుడు రెండు ఎంపీ స్థానాలు గెలిచిన రోజు అవహేళన చేశారని, కానీ ఈ రోజు బీజేపీ అధికారంలోకి వచ్చిందని, లోక్‌సభ ఎన్నికలలో తెలంగాణలో సైతం 36 శాతం వరకు ఓట్లు వచ్చాయని గుర్తు చేశారు. ‘‘దేశం కోసం బీజేపీ ప్రభుత్వం చట్టాలు చేస్తుంది. పార్టీలో అధికారంలో ఉందా లేదా అన్నది చూడకుండా దేశం కోసం పనిచేసే పార్టీ బీజేపీ మాత్రమే.’’ అని అన్నారు.

అనంతరం సభ్యత్వం గురించి మాట్లాడుతూ.. అనంతరం టార్గెట్ కంటే ఎక్కువ సభ్యత్వ నమోదు చేయించాలని కార్యకర్తలు, నేతలకు పిలుపుఇచ్చారు. ప్రతి పోలింగ్ బూత్‌లో కనీసం 200 మందితో సభ్యత్వ నమోదు చేయించాలన్నారు కిషన్‌ రెడ్డి. కనీసం 100 మందికి పైగా సభ్యత్వం చేసిన వారికే పార్టీ పదవులు ఇవ్వడం జరుగుతుందని, అలాగే క్రియాశీలక సభ్యత్వం కావాలంటే 100 మందిని విధిగా చేర్పించాలని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed