Kishan Reddy: హైదరాబాద్ అంటే హై‌టెక్ సిటీయేనా.. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

by Shiva |   ( Updated:2024-08-14 09:25:53.0  )
Kishan Reddy: హైదరాబాద్ అంటే హై‌టెక్ సిటీయేనా.. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: హైదారాబాద్ అంటే హైటెక్ సీటీయే కాదని పాత నగరంలో కూడా అందులో అంతర్భాగమేనని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం తీరుపై ఆయన విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం కేవలం హైటెక్ సీటీ ప్రాంత అభివృద్ధిపై చూపిస్తుందని ఆరోపించారు. నగరంలో అంబర్‌పేట్, ముషీరాబాద్ లాంటి ప్రాంతాలు కూడా ఉన్నాయని గుర్తు చేశారు. చాలా ప్రాంతాల్లో పారిశుధ్య సమస్యలు తలెత్తుతున్నాయని జీహెచ్‌ఎంసీ, వాటర్ వర్క్స్ లాంటి సంస్థలు నిధులు కొరతతో సతమతం అవుతున్నాయని తెలిపారు. నగరంలో మౌలిక వసతుల కల్పనకు పార్టీలకు అతీతంగా ముందుకొచ్చి పని చేయాలని కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు.

Advertisement

Next Story