- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బ్రేకింగ్: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పుపై కిషన్ రెడ్డి క్లారిటీ
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్‌లో గత కొన్ని రోజులుగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షున్ని మారుస్తారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలకు మరింత బలం చేకూర్చేలా తెలంగాణ బీజేపీ నేతలు వరుసగా ఢిల్లీ పర్యటనలకు వెళ్తున్నారు. దీంతో ఈ టాపిక్ తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పుపై బీజేపీ కీలక నేత, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పునకు అసలు అవకాశమే లేదని గత కొన్ని రోజులుగా వినిపిస్తున్న వార్తలకు కిషన్ రెడ్డి చెక్ పెట్టారు. తెలంగాణకు చెందిన బీజేపీ రాష్ట్ర నాయకులు ఢిల్లీ వెళ్లి జాతీయ నేతలను కలవడం సహజమని అన్నారు. వారు ఢిల్లీ వెళ్లినంత మాత్రాన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని మారుస్తున్నట్లు కాదని తేల్చి చెప్పారు. దీంతో గత కొన్ని రోజులుగా వినిపిస్తోన్న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పు వార్తలకు తెరపడినట్లైంది.
ఇక, ఇటీవల ముగిసిన కర్నాకట ఎన్నికల ప్రభావం తెలంగాణపై ఉండదని కిషన్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌కు తెలంగాణలో భవిష్యత్ లేదన్నారు. తెలంగాణలో అధికార బీఆర్ఎస్‌కు బీజేపీనే ప్రత్యామ్నాయం అని దీమా వ్యక్తం చేశారు. ఇక, ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌పై స్పందించిన కిషన్ రెడ్డి.. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబీఐ పరిధిలోని అంశమని పేర్కొన్నారు. ఆధారులున్నాయి కాబట్టే సీబీఐ ఈ కేసులో సిసోడియాను అరెస్ట్ చేసిందని తెలిపారు.