కిసాన్ ద్రోహి కేసీఆర్: వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల

by Nagaya |   ( Updated:2023-01-09 13:24:08.0  )
కిసాన్ ద్రోహి కేసీఆర్: వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల
X

దిశ, డైనమిక్ బ్యూరో : మరోసారి కేసీఆర్ హయాంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. 'రైతులకు పంట రుణాలు లేవు. ఉచిత ఎరువులు లేవు. సబ్సిడీ విత్తనాలు లేవు. ఇన్ పుట్ సబ్సిడీ లేదు. పంట నష్టపోతే పరిహారం కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు ఆత్మహత్య చేసుకుంటే సాయం లేదు. కౌలు రైతులకు దిక్కూమొక్కూ లేదు. కేవలం రూ.5 వేల రైతుబంధు ఇచ్చి.. రైతు ప్రభుత్వమని, సిగ్గులేకుండా గొప్పలు చెప్తున్నాడు కిసాన్ ద్రోహి కేసీఆర్' అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

Advertisement

Next Story